బ్రెజిల్‌లోని ఓ ఫుట్‌బాల్ క్లబ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పది మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు.  వీరందరూ పది నుంచి 16 ఏళ్ల లోపు వారే.  రియో డీ జెనిరోలోని ఫ్లెమెంగో అనే ఓ ఫుట్‌బాల్ క్లబ్‌లో రాత్రిపూట మంటలు చెలరేగడంతో.. 10మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ నిద్రలోనే సజీవ దహనమయ్యారు. వీరంతా టీనేజర్సే కావడం గమనార్హం.   క్లబ్‌లోని డార్మిటరీలో క్రీడాకారులు నిద్రిస్తున్న వేళ మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన మంటల్లో చిక్కుకున్న చిన్నారులు తప్పించుకునే మార్గంలేక మంటలకు ఆహుతయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనపై స్పందించిన ఫెలిప్ కార్డోసో అనే ఫుట్‌బాల్ ప్లేయర్.. రాత్రిపూట ఓ ఎయిర్ కండిషనర్ నుంచి మొదట మంటలు చెలరేగినట్టు చెప్పాడు. దాంతో తాను బయటకు పరుగులు తీశానని.. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డానని అన్నాడు.ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌కీ, మరో జట్టుకి మధ్య నేడు మ్యాచ్ జరగాల్సి ఉండగా అంతలోనే ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

 క్లబ్ 123ఏళ్ల చరిత్రలో ఇంతటి విషాదకర ఘటన ఎన్నడూ చోటు చేసుకోలేదని అధికారులు అంటున్నారు. మృతుల కుటుంబాలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: