‘జగన్ తన ఇంటి గృహప్రవేశానికి కెసియార్ ను పిలవటం ద్వారా ఏపిని కెసియార్ కు తాకట్టు పెట్టేసినట్లే’......ఇది తాజాగా జగన్ పై చంద్రబాబునాయుడు ఆరోపణలు. చంద్రబాబు నుండి ఇంతకన్నా మెరుగైన మాటలు వస్తాయని ఎవరూ అనుకోవటం లేదు. తన ఇంటి గృహప్రవేశానికి ఎవరిని పిలవాలన్నది జగన్మోహన్ రెడ్డి ఇష్టం. కాబట్టే కెసియార్ ను ఆహ్వానించి ఉండవచ్చు. అంటే ఈ విషయాన్ని ఎక్కడా జగన్ ఇప్పటి వరకూ ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. బహుశా చంద్రబాబు కూడా మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ప్రస్తావించుండాలి.

  Image result for chandrababu tension

ఇక్కడ విచిత్రమేమిటంటే, కెసియార్ ను తన ఇంటి గృహప్రవేశానికి పిలవటం, కెసియార్ రావటమన్నది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. గృహప్రవేశానికి పిలిచినంత మాత్రాన రాష్ట్రాన్ని కెసియార్ కు జగన్ తాకట్టుపెట్టినట్లు ఎలా అవుతుందో అర్ధం కావటం లేదు. అలాగనుకుంటే, అమరావతి శంకుస్ధాపనకు స్వయంగా చంద్రబాబే వెళ్ళి కెసియార్ ను ఆహ్వానించారు కదా ? మరి అప్పుడు తాకట్టుపెట్టినట్లు కాదా ? తర్వాత రెండు మూడుసార్లు చంద్రబాబు పిలవటం కెసియార్ అమరావతికి రావటం అందరికీ తెలిసిందే. మరి అప్పుడు కూడా తాకట్టు పెట్టేసినట్లేనా ?

 Image result for chandrababu tension

జగన్ విషయంలో చంద్రబాబు చెప్పిన తాకట్టు నిజమే అయితే చంద్రబాబే ఏపిని కెసియార్ కు ఇఫ్పటికే మూడుసార్లు తాకట్టు పెట్టేసినట్లే లెక్క. అదే సమయంలో కెసియార్ చేసిన యాగానికి చంద్రబాబు హాజరయ్యారు కద. మరపుడు తెలంగాణాను చంద్రబాబుకు కెసియార్ తాకట్టు పెట్టేసినట్లేనా ? దుర్గ గుడికి, తిరుమల ఆలయానికి కూడా కెసియార్ మొక్కుల పేరుతో వచ్చారు కద. కొడుకు పరిటాల శ్రీరామ్ పెళ్ళికి మంత్రి పరిటాల సునీత స్వయంగా వెళ్ళి ఆహ్వానించారు. కెసియార్ కూడా వివాహానికి హాజరయ్యారు. మరి సునీత కూడా ఏపిని కెసియార్ కు తాకట్టు పెట్టేసినట్లేనా ?

 Image result for chandrababu tension

జిల్లాల వారీగా క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు అనుమానంగానే కనిపిస్తోంది. మంత్రులు, ఎంఎల్ఏలే కాదు నేతల్లో కూడా అదే భావన బాగా తెలుస్తోంది. ఒకవైపు నేతలు పార్టీని వీడటం, మరోవైపు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో టిడిపిని మళ్ళీ గెలిపించే విషయంలో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే జగన్ గురించి చంద్రబాబు అనవసరంగా ప్రస్తావిస్తున్నారు.

 Image result for chandrababu tension

చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే పనికిమాలిన మాటలుగానే అనిపిస్తున్నాయి. టిడిపి నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్సులో పార్టీ పటిష్టానికి, రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుకోకుండా అక్కడ కూడా జగన్ గురించేనా ? అవసరం లేకపోయినా జగన్ గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారంటే చంద్రబాబుకు జగన్ ఫోబియా బాగా పట్టుకున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: