దేశం మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను చాలా సునిశితంగా ప‌రిశీలిస్తుండ‌గా.. రాష్ట్ర ప్ర‌జ‌లు మొత్తం చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. గ‌త ఆరు నెల‌లుగా ఈ ప్రాంతంలో ఎన్నిక‌ల రేపో మాపో అన్నంత ప‌రిస్థితిని త‌ల‌పిస్తున్నాయి. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ‌డ్డికి టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా  పోటీ చేయ‌నున్న పులిమ‌ర్తినానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మంటోంది. రాజ‌కీయాల‌ను రాజ‌కీయాలుగా కాకుండా వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య పోరు భీక‌రంగా సాగుతోంది. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే పంప‌కాలు మొద‌లుపెట్ట‌డం విశేషం. పండుగోచ్చినా...వేడుక జ‌రిగినా ఓట‌ర్ల‌కు తాయిలాలు..న‌జ‌రానాలు అందిస్తున్నారంటే పోరు ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవ‌చ్చు.


ఇటీవ‌ల సంక్రాంతి పండుగ‌కు...అంత‌కు ముందు దీపావ‌ళికి..జ‌న‌వ‌రి ఫ‌స్ట్‌కు ఇలా ప్ర‌తీ సంబ‌రాన్ని  పుర‌స్క‌రించుకుని మ‌హిళ‌ల‌కు చీర‌లు, జాకెట్లు  పురుషుల‌కు టీ ష‌ర్టులు..పంచెలు, ప్యాంట్లు, ఇంటింటికి స్వీట్లు పంచుతూ ఇద్ద‌రు నేత‌లు తెగ హ‌డావుడి చేస్తున్నారు. ఖ‌ర్చులో ఒక‌రిని మించి ఒక‌రు పోటీ ప‌డుతూ భీక‌ర ఖ‌ర్చుకు తెర‌లేపినట్లు స‌మాచారం. ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే ఎన్నిక‌ల నాటికి ఎలా ఉంటుందోనని రాజ‌కీయ నాయ‌కులు విస్తు పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి టీడీప అభ్య‌ర్థిగా గ‌ల్లా అరుణ‌కుమారి బ‌రిలోకి దిగారు. వైఎస్సార్ అభిమానులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాస్త ఎక్క‌వ‌నే చెప్పాలి.
ఆయ‌న‌పై ఉన్న అభిమానం ...మాజీ తుడా చైర్మ‌న్‌గా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చేసిన మంచి ప‌నుల‌ను ద‌`ష్టిలో ఉంచుకున్న జ‌నం ఆయ‌న్ను గెలిపించారు. 

ఆ త‌ర్వాత గ‌ల్లా అరుణ ఇక తాను రాజ‌కీయ ప‌ద‌వుల‌కు పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించ‌డంతో  త‌ర్వాత ప‌రిణామాల్లో భాగంగా నానికి నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూనే అభ్య‌ర్తిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇక అప్ప‌టి నుంచి భాస్క‌ర్‌రెడ్డి నాని మ‌ధ్య నిప్పు ఉప్పు అన్న రీతిలో  ప‌రిస్థితి త‌యారైంది.
 ఈసారి చంద్ర‌గిరిలో జ‌ర‌గ‌బోయేది ఎన్నిక కాదు..యుద్ధం అంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడివేడిగా కామెంట్లు పేలుతున్నాయి. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఇప్ప‌టికే త‌రుచూ గొడ‌వ‌లు..ఘ‌ర్ష‌ణ‌లు..కేసుల న‌మోదు వంటి అంశాలు స‌ర్వ సాధార‌ణ‌మ‌య్యాయి.

ఈసారి ఎలాగైనా ఈ సీటును ద‌క్కించుకోవాల‌ని రెండు పార్టీల నాయ‌కులు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.  ఇక జ‌న‌సేన కూడా ఇక్క‌డ పోటీ చేయాల‌ని యోచిస్తోంది. ఆపార్టీ నుంచి డాక్ట‌ర్ ల‌క్ష్మీదేవి అభ్య‌ర్థిగా దాదాపుగా ఖ‌రార‌య్యారు. ఇక బీజేపీ నుంచి పుష్ప‌ల‌త పోటీ చేయ‌నున్నారు. కాంగ్రెస్ నుంచి ఇండా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. అన్ని పార్టీలు బ‌రిలో నిల‌వాల‌ని చూస్తున్న వైసీపీ టీడీపీల మ‌ధ్యే  ప్ర‌ధానంగా పోరు సాగ‌నుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: