లోకేష్  సభలో ఒక వింత సంఘటన చోటు చేసుకున్నది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 4 లక్షల గృహప్రవేశాలను చంద్రబాబు సర్కార్ అట్టహాసంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం భారీ ఎత్తున బహిరంగ సభ చేపట్టింది. ఏర్పాట్లు కూడా ఆర్భాటంగానే ఉన్నాయి. వందల కుర్చీలు వేశారు. ఇక్కడే తేడా వచ్చింది. వాటిపై జగన్ స్టిక్కర్లు ఉన్నాయి. జగన్ కావాలి.. జగన్ రావాలి అనే స్లోగన్స్ కూడా ఉన్నాయి.

Image result for lokesh

సభలో ఏర్పాటు చేసిన చాలా కుర్చీలపై ఇలాంటి జగన్ బొమ్మలు దర్శనం ఇచ్చింది. సభా నిర్వహకులు ఎవరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. సభ ప్రారంభం అయ్యే సమయానికి కూడా గుర్తించలేదు. కొందరు మీడియా వాళ్లు గమనించి ఫొటోలు - వీడియోలు తీయటం..అవి సోషల్ మీడియాలో వైరల్ అవడం అంతా జరిగిపోయింది. దీంతో కలకలం చోటుచేసుకుంది. అప్పుడు అసలు విషయాన్ని గుర్తించని అధికారులు.. ఆ వెంటనే పరుగులు పెట్టారు.

Image result for jagan

తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ చిర్రుబుర్రులాడారు. కానీ అప్పటికే అది మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ నవ్వుల పాలయిన ఎపిసోడ్ వెనుక ఆసక్తికర కారణం ఉందంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం జరిగింది. ఆ సభలో కుర్చీలపై జగన్ కావాలి.. జగన్ రావాలి అని స్టిక్కర్లను అంటించారు. తాజాగా వాటిని మంత్రి నారా లోకేష్ సభకు తరలించారు. ఏ మాత్రం పరిశీలించకుండా.. చెక్ చేయకుండా వేసేశారు. దీంతో..ఇలా లోకేష్ సభ నవ్వుల పాలయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: