2014లో వైస్సార్సీపీ పార్టీ తరుపున అది నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి తరువాత టీడీపీ పార్టీలోకి జంప్ అయ్యాడు. అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్ కు ఝలక్కిచ్చి పార్టీ మారిపోయారు. ఏకంగా మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంపై నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రచించిన రాజీ ఫార్ములాతో ఇప్పుడు ఆది ఇంటికే పరిమితం కావాల్సిన దుస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.


జమ్మలమడుగులో టీడీపీ ప్రస్థానం మొదలెట్టిన నాటి నుంచి రామసుబ్బారెడ్డి కుటుంబం ఆ పార్టీకి అండగా నిలిచింది. పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లోనూ రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీని వీడలేదు కదా.. పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిందనే చెప్పాలి. అయితే వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి... ఇప్పుడు రామసుబ్బారెడ్డికి పెద్ద ఇబ్బందిగానే మారారు. అయితే వీరిద్దరినీ ఒకే బాటలో నడిపించేసి... వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టాలని చంద్రబాబు వ్యూహం రచించారు. ఈ వ్యూహం ప్రకారం ఆది - రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ కుదిర్చిన చంద్రబాబు... ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటు నుంచి బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేశారు.

Image result for adi narayana reddy

రామసుబ్బారెడ్డితో రాజీకి సరేనన్న ఆది... కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు కూడా ఒప్పేసుకున్నారు. అయితే... కడప పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ గెలుపు దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే... ఈ స్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా టీడీపీ ఒకే ఒక్కసారి అక్కడ విజయం సాధించింది. అది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి పార్లమెంటు బరికి శ్రీకారం చుట్టకముందు మాట.ఎప్పుడైతే రాజశేఖరరెడ్డి కడప పార్లమెంటులో కాలుపెట్టరో... అప్పటి నుంచి అక్కడ వైఎస్ ఫ్యామిలీనే గెలుస్తూ వస్తోంది. ఇలా గెలవని చోట ఆదినారాయణ రెడ్డి ని ఇరికిచ్చారని అందరు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: