వైఎస్ జగన్ వ్యూహాలు నలభయ్యేళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబునుపదే పదే  కలవరపెడుతున్నాయి. హామీలు ఇవ్వడంలో కానీ, పోరాటాలు చేయడంలో కానీ బాబు జగన్ని అనుసరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ తనదైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. వాటి ఫలితాలు కూడా ఆయనకే లాభించేలా  ఉన్నాయి.


బీసీ గర్జన అలా:


నిజానికి జగన్ బీసీ గర్జన నిర్వహించి బీసీల డిక్లరేషన్ ప్రకటిస్తామని చాలా ముందుగానే  చెప్పుకొచ్చారు. ఇది పాదయాత్రలో ఎప్పటికపుడు జగన్  చెబుతూనే ఉన్నారు. అయితే హడావుడిగా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగా టీడీపీ ఆద్వర్యంలో జయహో బీసీ అంటూ చంద్రబాబు ఓ మీటింగు పెట్టి బీసీలంతా తమవైపే అని ఆర్భాటం చేశారు. ఇపుడు జగన్ ముందే చెప్పినట్లుగా బీసీ గర్జన నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న నిర్వహిస్తున్న బీసీ గర్జన నిజంగా ఓ రికార్డ్ గా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.


అతిథిగా ఆర్ క్రిష్ణయ్య :


ఇక్కడే జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహించారనిపించారు. బీసీల గురించి తగ కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్ష్దుడు ఆర్ క్రిష్ణయ్యని పిలవడం ద్వారా జగన్ చాలా నేర్పుగా వ్యవహరించారు. బీసీలకు పెద్ద దిక్కుగా ఉన్న క్రిష్ణయ్య ఈ మీటింగుకు కనుక వస్తే మాత్రం నిజమైన బీసీల సభగా అది మారుతుందండంలో సందేహం లేదు. 
ఇక జగన్ మరింత ముందు చూపుగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం కూడా ఆయా వర్గాల పట్ల ఉన్న చిత్తశుధ్ధిని తెలియచేస్తోంది. మొత్తానికి జగన్ బాబు మాదిరి కాకుండా చాలా వ్యూహాత్మకంగా  బీసీల మీటింగు పెడుతున్నారు. ఈ సంధర్భంగా జగన్ ప్రకటించే వరాలు, ఇచ్చే హామీలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: