2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో చాలా సర్వేలు ఇప్పటికే ఫలితాలను ప్రకటించాయి. మార్చినెల ప్రథమార్థంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదల కావొచ్చు. ప్రత్యేకించి ఏపీకి అటు లోక్‌సభ  ఇటు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి అయితే తాజగా ఒక ప్రైవేట్ సర్వే రోజా నియోజక వర్గం లో సర్వే నిర్వహించింది .  చిత్తూరుజిల్లా నగరిలో గత ఎన్నికల్లో ఆర్కే రోజా విజయం సాధించారు. తెలుగుదేశం సీనియర్‌ పొలిటీషియన్‌ గాలి ముద్దుకష్ణమ నాయుడు మీద ఆమె విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు.

Image result for mla roja

అధికారపక్షానికి ప్రత్యేక లక్ష్యంగా నిలిచారు రోజా. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు బహిష్కరించడం, ఆమె వాదన వినడానికి కూడా ఏపీ అసెంబ్లీ ఆసక్తి చూపకపోవడం.. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు గురయ్యారు ఆమె. రోజా స్థానికంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన ముద్దుకృష్ణమ కొన్నాళ్ల కిందట మరణించారు. ఆయన తనయులు ఇద్దరూ రాజకీయ వారసత్వం కోసం పోటీ పడ్డారు.

Image result for mla roja

చేసేది లేక చివరకు ముద్దుకృష్ణమ భార్యకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం ఎవరికి అనే అంశం గురించి ఖరారు చేయలేదు. ఇక్కడ రోజా గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా ఈ ఫలితాలు జోష్ ను పెంచేయే. వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ - 53 శాతంతెలుగుదేశం పార్టీ- 46 శాతంఇతరులు - ఒకశాతం . అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: