ఎట్టకేలకు గుంటూరు సభలో మోడీ సభ జరిగింది. చంద్ర బాబు పై తన దైన శైలిలో విరుచుకుపడ్డాడు. సెటైర్స్ ల రూపంలో ఎవరైనా మోడీ తరువాత నని నిరూపించు కున్నాడు. దేశ రాజకీయాల్లో తానే సీనియర్ ను అని ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా తానే సీనియర్ను అని చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే.  చంద్రబాబు సీనియారిటీపై మోదీ చేసిన సెటైరిక్ విమర్శలు ఎలా సాగాయన్న విషయానికి వస్తే.... సొంత మామను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియరే.

Image result for narendra modi

ఆ విషయంలో నేను ఏమాత్రం చంద్రబాబుకు సరి తూగలేను. మిత్రపక్షాలను మార్చడంలో పార్టీల ఫిరాయింపులులో ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో మాత్రమే చంద్రబాబు సీనియర్. ఈ రోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్. ఎన్టీఆర్ కుర్చీని అందుకున్న వ్యక్తి(చంద్రబాబు)... ఆయన కలలను నిజం చేస్తానని చెప్పాడా? లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారా? లేదా?


కానీ ఈరోజు ఎన్టీఆర్ మాటలకు గౌరవం ఇస్తున్నారా? ఈ విషయం సామాన్యులకు కూడా అర్థం అవుతోంది. కానీ చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్లకు ఎందుకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పంచన వెళ్లి కూర్చోవాల్సినంత ఇబ్బంది చంద్రబాబుకు ఏమొచ్చింది? పార్టీ సిద్ధాంతాలను వదిలేయాల్సినంత ఒత్తిడి ఏమి వచ్చింది? కాంగ్రెస్ అణచివేత అహంకారం నచ్చకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ ముక్త ఏపీని చేయాలని నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: