ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు గుంటూరులో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రజా చైతన్య వేదిక "సథ్యమేవజయతే" సభలో  ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ నేడు (ఆదివారం) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగులో ఉపన్యాసం ప్రారంభించిన ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పారు. గుంటూరు జిల్లాలో పుట్టిన గుర్రం జాషువా, తిక్కన్న, వావిలాల గోపాల కృష్ణయ్య, నాయుడమ్మ లాంటి మహనీయులను గుర్తుచేస్తూ నరేంద్ర మోడీ తన ప్రసంగం ప్రారంభించారు. 
narendra modi in guntur today కోసం చిత్ర ఫలితం
నరేంద్ర మోడీ తన ప్రసంగంలో  వావిలాల గోపాలకృష్ణయ్యకు వందనాలు చెప్పారు. ఎంతో మంది ప్రముఖులను  ఈ గుంటూరు జిల్లా నుండి వచ్చినవారేనని ఆయన గుర్తుచేశారు. అమరావతి అనేది సాంస్కృతికంగా విధ్యా వైఙ్జానిక పరంగా ఆంధ్రప్రదేశ్‌ ను "ఆక్స్‌ఫర్డ్‌" గా వర్ణిస్తారని ఆయన చెప్పారు. గుంటూరుకు సమీపంలోని అమరావతికి ఎంతో అధ్యాత్మిక చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అమరావతిని "హెరిటేజ్‌ సిటీ" గా కేంద్రమే అభివృద్ధి చేస్తుందని చెప్పారు.


దేశంలో తనకే అందరికంటే సుధీర్ఘ రాజకీయ అనుభవం అంటున్న సీనియర్నని పదే పదే చెప్పుకునే చంద్రబాబు విధానాన్ని తూర్పారబట్టారు.  ఆయన పార్టీలు ఫిరాయింపులు చేయడంలో సీనియర్లన్నారు. కొత్త కొత్త కూటములను కట్టగట్టడంలో కూడ సీనియర్ అని చెప్పారు. ఇవాళ ఎవరిని తిడుతారో, ఆ తర్వాత వారి ఒడిలోనే కూర్చోవడంలో కూడ ఆయనే సీనియర్‌ అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
narendra modi in guntur today కోసం చిత్ర ఫలితం

ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ ఆయనే సీనియర్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి మోడీ విమర్శించారు. మామను వెన్నుపోటు పొడవడంలో కూడ మీరే సీనియర్ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల కలలను ధ్వంసం చేయడంలో కూడ సీనియర్ అన్నాడన్నారు. ఎన్టీఆర్ కలలను కూడ బాబు ధ్వంసం చేశాడన్నారు. కూలిపోయిన తన పార్టీని నిర్మించుకోవడంలో, తన కుమారుణ్ణి రాజకీయాల్లో నిలబెట్టటంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనను వదిలేసి చాలా బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.కేంద్రం నుండి ఎన్ని నిధులు ఇచ్చామో?  చెప్పమంటే  చంద్రబాబు లెక్కలు మాత్రం చెప్పడం లేదన్నారు.


ఢిల్లీలో దీక్ష పేరుతో ఫోటోలు తీయించు కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఈ దీక్షకు నిధులు ఎక్కడివో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.



అదే సమయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను ఈ సభ నిర్వహణకు అయిన కర్చుకు నిధులెక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించగా ఆయన ప్రతి పైసా కార్యకర్తలు సమకూర్చిందే నని చెప్పారు. మరి డిల్లీ దీక్షకు చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం దుబారాచేస్తూ అందులోను ఆయనే సీనియరుగా నిలిచారన్నారు. తమకు ఆ విషయాల్లో సీనియారిటీ లేదని - అసలు సీనియారిటీ అసలు చర్చించవలసిన విషయమే కాదని చెప్పారు. 
narendra modi in guntur today కోసం చిత్ర ఫలితం
ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా ఏపి ముఖ్యమంత్రి అయిన మీరు, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారా? ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చారా? ఆయన తెలుగు దేశం పార్టీ ఏ విధానాలపై పునాదు లపై నిర్మించారో దానిని మీరు అనుసరిస్తున్నారా? అని సభా ముఖంగా చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిని వదిలి పెట్టి నన్ను తిట్టడమే పనిగా పెట్టు కొన్నారని చెప్పారు.


మీరు సీనియర్‌ నేత, మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నేను ఏనాడూ విస్మరించలేదన్నారు. చంద్రబాబు నాకంటే సీనియర్, ఇందులో వివాదం లేదని మోడీ ప్రకటించారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసింది శూన్యం ఆయన అమలు చేస్తున్న పథకాలన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని నరేంద్ర మోడీ విమర్శించారు. గతాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని నరేంద్ర మోడీ చెప్పారు. ఎన్టీఆర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మంది నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయం గుర్తుచేశారు, ఎన్టీఆర్‌ ను అవమానించిన కాంగ్రెస్‌ తో  మీరు ఎలా అంటకాగుతున్నారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ పార్టీ అంటే, చంద్రబాబు అదే పార్టీతో దోస్తీ చేస్తున్నారని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.
narendra modi in guntur today కోసం చిత్ర ఫలితం
55 నెలల్లో ఏపీ రాష్ట్రానికి నష్టం చేయలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే అసెంబ్లీలో అభినందిస్తూ తీర్మానం చేసిన విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు. 2016 సెప్టెంబర్  మాసం లో ప్రత్యేక ప్యాకేజీని పూర్తిగా అమలు చేస్తే దీన్ని చంద్ర బాబు సరిగా రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగించు లేకపోయారన్నారు. ₹ 3లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్టు నరేంద్ర మోడీ వివరించారు.


విభజన చట్టం లోని అంశాలను పూర్తి చేయటానికి పదేళ్ళ వ్యవధి ఉన్నా గతంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాకు రాష్ట్రాల సమస్యలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నాకు పూర్తిగా తెలుసు కాబట్టే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఐదేళ్ళలోనే చాలా వరకు అమలు చేశామని నరెంద్ర మోడీ చెప్పారు.  ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా పని చేస్తామన్నారు. ఏపీ ప్రజలు సంస్కారవంతులని దేశ ప్రజలకు తెలుసునని చెప్పారు.
stage on with modi addressed in guntur కోసం చిత్ర ఫలితం
అలాంటి చంద్రబాబు డిక్షనరీలోని తిట్లన్నీ కూడ తనను  తిట్టేందుకు ఉపయోగిస్తూ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను మంటగలుపు తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలు కానుందన్నారు. ప్రజలు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇవ్వనున్నారని నరెంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఏపీలోని తండ్రీ కొడుకుల పాలన అంతం కానుందన్నారు. 


మోడీ గో బాక్ అంటూ టిడిపి ప్రేరిత శక్తుల నిరసనను తాను సద్భావనతో  "నన్ను తిరిగి వెళ్ళి డిల్లి పీఠంపైనే కూర్చోమని దీవిస్తున్నట్లుగా ప్రజలు ఆశిస్తున్నట్లు"  భావిస్తున్నానని అనారు. ఆ ఆశీస్సులతోనే కేంద్రంలో మరోసారి  బీజేపీ అధికారం లోకి వస్తోందన్నారు. అందుకే తమను గో బ్యాక్ అంటున్నారని మోడీ చమత్కరించారు. తన పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లను ఎగురవేయడాన్ని  కూడా ఆయన  ప్రస్తావిస్తూ, ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించే సమయంలో దిష్టి తీయడం భారతీయ సంప్రదాయమన్నారు. మీరు నల్ల బెలూన్లను ఏగరేసి నా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి దిష్టి తీసి జయీభవ అని అంటున్నట్లు భావిస్తున్నట్టు మోడీ చలోక్తులు విసిరారు. 
stage on with modi addressed in guntur కోసం చిత్ర ఫలితం
రాష్ట్రానికే కాదు డేశం మొత్తానికి ఆర్ధిక ఉద్యోగ వనరులు ఏర్పరచబోయే మౌలిక ప్రోజెక్ట్ లకు వేల కోట్లతో కొద్ది సేపటి క్రితమే తాను శంకుస్థాపన చేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల  దేశానికి కూడ ఉపయోగం కలుగుతోందన్నారు. పెట్రోలియం రంగంలో కొరత ఏర్పడకుండా చమురు నిల్వలకోసం ఈ రకమైన పథకాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రం లోని విశాఖలో కూడ ఇలానే  ఏర్పాటు చేశామని చెప్పారు.


ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని నరేంద్ర మోడీ చెప్పారు. నిన్న అస్సాంలో నార్త్‌-ఈస్టన్ గ్యాస్ గ్రిడ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. కొత్త భారత నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నట్టు నరేంద్ర మోడీ చెప్పారు.  కొత్తగా ప్రాజెక్టులు చేపట్టిన జిల్లాకు చెందిన ప్రజల జీవనంలో చాలా మార్పులు రానున్నాయని మోడీ అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల్లో దేశంలోని అన్ని పట్టణాల్లో కూడ ఇదే రకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వంపై, తనపై
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గమనించమని నరేంద్ర మోడీ చెప్పారు. 
stage on with modi addressed in guntur కోసం చిత్ర ఫలితం
దీన్నిబట్టి లోకేష్ తండ్రికి  (చంద్రబాబు) కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్లు వేశారని, ఆయన చేసింది ఏమీ లేదని ఋజువౌతుంది. ఇన్నేళ్ళ చంద్రబాబు ఊదరగొట్టే సోది అంతా పదే పదే చెతితే  గోబెల్ చెప్పినట్లు నిజమౌతాయని అనుకొని ఉండోచ్చు. కాని నరెంద్ర మోడీ వేసిన లాస్ట్ పంచ్ లో కిక్కు తీరే వేరని తెలుస్తుంది. చంద్రబాబు చేసిన చేస్తున్న దుబారా వ్యయాలు రాష్ట్రాన్ని దివాలా తీయించినట్లే నరేంద్ర మోడీ పరోక్షంగా చెప్పారు. ఇక ముందుంది చంద్ర బాబుకు ముసళ్ళ పండగ. 

మరింత సమాచారం తెలుసుకోండి: