రాజకీయాల్లో అతి ఎపుడూ మంచిది కాదు, అందునా కీలక పదవుల్లో ఉన్న వారికి, ఓ పార్టీకి నాయ‌కత్వం వహిస్తున్న వారికి సహనం చాలా అవసరం. ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వారే వ్యవస్థలను గౌరవించకపోతే విపరిణామాలకు బాధ్యత వహించక తప్పదు.


మోడీ పంచులు అదిరాయ్ :


ఒక రోజు రెండు రోజులు  కాదు గత ఏడాదిగా ప్రధాని మోడీపై చంద్రబాబు రోజుకు వందసార్లు విరుచుకుపడుతున్నారు. ఎంతలా అంటే పొరుగున ఉన్న మమతా బెనర్జీ కన్నా. సిధ్ధాంత‌ భేదం ఉన్న వామపక్షాల కంటే ఎక్కువగా బాబు  మోడీని టార్గెట్ చేశారు ఇదంతా బాబులో పెరిగిపోతున్న అసహనం నుంచి అభద్రతాభావం నుంచి పుట్టుకొచ్చినదిగా చెప్పుకోవాలి. నాలుగేళ్ళు బీజేపీ మంచిదని చెప్పిన ఇదే చంద్రబాబు ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయని పొత్తులు పెటాకులు ఇచ్చేసి దుమ్మెత్తి పోస్తూంటే అక్కడున్నది వాజ్ పేయ్ అద్వానీ కాదు, బాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన మోడీ. ఆయన మరి వూరుకుంటారా.


అద్దాల‌ గది బద్దలైంది :


బాబు అద్దాల గదిలో కూర్చున్నారు. రాళ్ళు మోడీపై  ఆయన వేయడం ప్రారంభించారు. మరి అవతల వారు కూడా అవే రాళ్లు వేస్తారని మరచిపోయారు. దానికి తిరుగు టపాలో అవే రాళ్ళు వచ్చాయి. అయితే కొంత ఆలస్యంగా మోడీ ఏపీకి వచ్చారు. అంటే బాబు తిట్లు అన్నీ విని విని ప్రజలు  కూడా ఇపుడు మోడీ తిరిగి తిట్టడంలో తప్పు లేదు కదా అని నిర్ధారణకు వచ్చిన సమయంలో మోడీ వచ్చారు. అంటే ఎంత కరెక్ట్ టైం మోడీ చూసుకున్నారో ఇక్కడ అర్ధమవుతుంది. మోడీని బాబు ఎన్ని నిందించినా  ఆ పార్టీలి ఏపీలో ఏం కాదు, ఎందుచేతనంటే ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు కాబట్టి.


భారీ నష్టమేనా :


మరి అదే మోడీ ఏపీకి  వచ్చి బాబుకు తిడితే మాత్రం ఉమ్మడి ఏపీని ఏలి పదమూడు జిల్లాలకు పడిపోయిన టీడీపీ ప్రాభవం ఇక్కడ కూడా మసకబారడం ఖాయం. ఇక  బాబు మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన పాలన మీద అవినీతిపై విమర్శలు ఉన్నాయి. మరి అవన్ని ప్రధాని హోదాలో ఉన్న మోడీ ఏకరువు పెడితే బాబుకు యమ డేంజేరే కదా. ఇపుడు అదే జరిగింది. గుంటూరు మీటింగులో శుభారంభం పలికిన మోడీ బాబుని ఏ విధంగాను వదిలిపెట్టలేదు. అబద్దాలతో నిర్మించుకున్న టీడీపీ అద్దాల మేడను మోడీ బద్దలు చేసి మరీ  వెళ్ళారు. ఇపుడెవరికి నష్టం. ఎవరిది అనుభవం. ఎవరిది సీనియారిటీ..


మరింత సమాచారం తెలుసుకోండి: