భారత దేశ రాజకీయాల్లో వారసత్వం అన్నది అనవాయితీగా వస్తున్నదే. కానీ. అన్ని సందర్భాల్లో అది క్లిక్ కాలేదు. జనాల్లో మెప్పు సంపాదించిన వారే నాయకులు అవుతారు. ఆ విధంగా వచ్చిన వారికి జనామోదం ఎపుడూ ఉంటుంది. అయితే పనిగట్టుకుని తమ వారసులను జనం మీదకు రుద్దలానుకున్న ప్రతీ సారీ అది విఫలప్రయోగమే అయిందని చరిత్ర చెబుతోంది.


లోకేష్ టార్గెట్ :


ప్రధాని మోడీ బాబు వారసత్వ రాజకీయాలపై గుంటూర్ సభలో గళం విప్పారు. నిజానికి ఇలా మోడీ లోకేష్ ని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలోనూ బాబుపై ఇదే విధంగా ఆరోపణలు చేశారు. అనువంశిక రాజకీయాలకు బీజేపీ దూరం. మోడీ విషయానికి వస్తే ఆయనకు సంసారం జంజాటం అసలే లేదు. దాంతో సులువుగా ఆయన బాబుపై ఈ విమర్శలు చేయగలుగుతున్నారు. ఏపీలో చంద్రబాబు తరువాత లోకేష్ భావి నాయకుడు అన్న మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. దానికి కౌంటర్ గా మోదీ విమర్శలు చేస్తున్నారు.


సన్ స్ట్రోక్ డేంజరే :


నిజానికి చాలా మంది రాజకీయ నాయకులు సన్ స్ట్రోక్ తగిలి పతనమైపోయారు. ఇందిరా గాంధి తన ప్రియతమ పుత్రుడు సంజయ గాంధి మాట విని ఎమెర్జెన్సీ టైంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక కొడుకుల వల్ల ఇబ్బందులు పడ్డవారిలో ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్ వంటి వారు కనిపిస్తారు. 
ఐతే ఇక్కడ అఖిలేష్ సొంతంగా ఎదిగిన తరువాత తండ్రి పార్టీని లాగేసుకుంటే, అవినీతి ఆరోపణలతో లాలూ కొడుకులు బీహార్ లో సర్కార్ పతనానికి కారకులు అయ్యారంటారు. హర్యానాలో దేవీలాల్ వంటి వారు అయితే కొడుకుల మీద ప్రేమతో తమ రాజకీయ పతనాన్ని కోరి తెచ్చుకున్నారు.


బాబు జవాబు చెప్పలేరుగా :


బాబు ఏ ఆరోపణ అయినా తనదైన శైలిలో తిప్పి కొడతారు కానీ లోకేష్ ని ఎందుకు రాజకీయాల్లో తెచ్చారు కీలకమైన పదవులు ఎలా ఇచ్చారంటే మాత్రం జవాబు లేదు, రాదు. తన తరువాత పార్టీ, ప్రభుత్వం లోకేష్ కి అప్పగించాలని బాబుకు చాలానే వుంది. కానీ లోకేష్ అంతటి సమర్ధుడా అన్నది సొంత టీడీపీ నేతల్లోనే ఉంది. ఇక విపక్షాల విమర్శలు సరే సరి. బాబు కొడుక్కి జాబ్ ఇచ్చారు కానీ యువకులకు మాత్రం ఒక్క జాబ్ ఏపీలో ఇవ్వలేదని హాట్ కామెంట్స్ ఎన్ని చేసినా బాబుకు ఇబ్బందికరమే తప్ప ఏమీ చెప్పుకోలేని స్థితి.
ఇపుడు ఆ సున్నితమైన అంశాన్ని మోడీ టార్గెట్ చేశారు. బాబు లోకేష్ లకు ఏపీనీ తాకట్టు పెట్టవద్దంటూ ప్రజలకు ఇచ్చిన ఈ పిలుపు ఆలొచింపచేసేదే మరి. దీనికి బాబు కచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిఉంటుంది. తన కొడుకు రాజకీయ వారసుడు కాడని బాబు అనగలరా...


మరింత సమాచారం తెలుసుకోండి: