ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఇక ఆయన్ను చంద్రగాంధీనాయుడు అని పిలుచుకోవడం మంచింది. అలా చేయడం ద్వారా ఆయన త్యాగాలను మనం గుర్తు చేసుకున్నవారం అవుతాము. ఏపీకీ, దేశానికి ఆయన చేసిన సేవలు గాంధీని తలపింపచేస్తున్నాయి. సారీ.. తలపింపజేయడం కాదు.. మరిపింపజేస్తున్నాయి.

Image result for gandhiji hd


ఈ విషయం కూడా ఆయనే స్వయంగా చెప్పారు. తాను గాంధీలా బతుకుతున్నారట. ప్రధాని మోదీ తనపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాపం బాబు చిన్నబుచ్చుకున్నారు. గాంధీలా చాలా సాధారణ జీవితం గడుపుతుంటే తనను అంత మాట అంటారా అని చాలా బాధపడిపోయారు చంద్రబాబు.. సారీ చంద్రగాంధీబాబు.

Image result for chandrababu new house


మోదీ  రోజూ రూ. కోట్ల విలువైన సూటు బూట్లు వేసుకుంటారని, తాను మాత్రం మహాత్మాగాంధీలా చాలా సాదాసీదాగా ఉంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 40 ఏళ్లుగా ఒకేరకం బట్టలు వేసుకుంటున్నాను. ఎక్కడకు వెళ్లినా వేషం మార్చడం లేదు. సూట్లు వేసుకోవడం లేదు. ఈ రోజు ప్రజల కోసం నల్ల చొక్కా వేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అదే కోపంతో మోడీపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

Image result for chandrababu with lokesh


అంతా బాగానే ఉంది.. కానీ ఓ చిన్న అనుమానం.. గాంధీ గారు కూడా ఇలాగే వందల కోట్ల రూపాయలతో ఆడంబరంగా ఇళ్లు కట్టుకున్నారా.. గాంధీ గారు కూడా విషయం లేకపోయినా కొడుకుకు పదవులు అందించేందుకు సిద్దపడ్డారా.. గాంధీ గారు కూడా పదే పదే రాజకీయాల్లో యూటర్న్ తీసుకున్నారా.. అలాంటి ప్రశ్నలు అడక్కండి.. చెప్పింది వినండి.. ప్రశ్నలు వేయకండి.. అర్థమైందా..


మరింత సమాచారం తెలుసుకోండి: