ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. గుంటూరు సభలో తనపై మోడీ తీవ్రవిమర్శలు చేయడంతో తాను కూడా అదే స్థాయిలో స్పందించాలని భావించారు. కానీ ఆ క్రమంగా కాస్త సంయమనం కోల్పోయారు. మోదీపై వ్యక్తిగతంగా ఆయన భార్య విషయం ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.



ఆ ట్వీట్ ఇదీ.. నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్‌ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది... ఇదీ బాబు పెట్టిన ట్వీట్..



ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు. వ్యక్తిగతంగా దాడి చేయడమేంటని నిలదీశారు.. చంద్రబాబు కుటుంబాన్ని, మోడీ కుటుంబాన్ని పోలుస్తూ కామెంట్లు పెట్టారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజా జీవితానికి వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టి మాట్లాడటం మిమ్మల్ని మీరు మరింత దిగజార్చుకోవడమే సర్..అంటూ ఓ నెటిజన్ స్పందించారు.



మరొకరు.. లోకేష్ గారిని చూసి గర్వ పడుతున్నారు అంటే మీరు చాలా అల్ప సంతోషి సార్.. అంటూ కామెంట్ చేశారు.. 40 సంవత్సరాల అనుభవం ఆంధ్ర ప్రజల అప్పులు పెరగడానికా హెరిటేజ్ కంపెనీ ద్వారా మీ సొంత ఆస్తులు పెంచు కోవడానికా ? మీ మనవడి మీ కొడుకు మీ కుటుంబము అస్తులు పెరిగినప్పుడు మన పేద ప్రజల ఆస్తులు ఎందుకు పెరగలేదో దీక్షల ద్వారా తెలియచేయగలరు అంటూ ఓ ఆంధ్రుడు కామెంట్ చేశారు.



పిల్ల నిచ్చిన మామా కి సున్నం పెట్టినా గొప్ప ఆళుఢు నీవు. మహాను బావుడు ఎన్టీఆర్ గారి పైన చెప్పులు వేపిచిన గొప్ప natudivi.బాలయ్య లాంటివాళ్లు పౌరుషం అని సినిమాలో తొడ గొటి మాట్లాడి నిజ జీవితం లో పౌరుషం లేకుండా midagaraku padivundadam గొరమఁ.



పాపం నందమూరి కుటుంబం లేకపోతే సప్లయర్ గా బతకావల్సిన వాడివి.. నువ్వు మాట్లాడడం . లోకేష్ నీ మంత్రి వర్గంలో మంత్రి ఎలా అయ్యాడు? ఏం మొహం పెట్టుకొని ఆధార పడలేదు అంటారు? అవినీతి కుటుంబం నారా కుటుంబం .. ఇలా చంద్రబాబు ట్వీట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. చంద్రబాబును సపోర్ట్ చేసే కామెంట్లు ఒకటీ అరా తప్ప కనిపించ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: