వైసీపీదే వచ్చే ఎన్నికల్లో అధికారం.. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ సీఎం కావడం ఖాయం.. ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఎన్నికల సర్వేలు చెప్పిన కబుర్లు ఇవే.. ప్రతి సర్వే కూడా జగన్ దే గెలుపుని చెబుతున్నారు. ఏ ఒక్క సర్వే కూడా ఇప్పిటవరకూ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తాడని చెప్పలేదు.



జాతీయ ఛానల్ల సర్వేలే కాదు.. లోకల్ సర్వేలూ అదే చెబుతున్నాయి. కానీ ఈ సర్వేలను నమ్ముకుంటే వైసీపీ కొంప కొల్లేరవడం ఖాయం అంటున్నారు కొందరు. గత ఎన్నికల తరహా ఫలితాలు రిపీటవుతాయంటున్నారు. అలా అనేది ఎవరో కాదు.. సొంత పార్టీ నేతలే కావడం మరో విశేష।ం.



వైసీపీకి అనుకూలంగా వస్తున్న సర్వేలను చూసి అతి విశ్వాసం తో ఉండవద్దని కడప మాజీ ఎమ్.పి వైఎస్ అవినాశ్ రెడ్డి కామెంట్ చేశారు. జగన్ అన్నకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన అంటున్నారు. అయితే అనుకూల వాతావరణం ఉందని, అయితే దానితోనే మనం ఊరుకోరాదని, అంతా బూత్ స్తాయిలో మెజార్టీ వచ్చేలా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు అవిశాష్.

Image result for avinash reddy


హైదరాబాద్‌లోని కుకట్ పల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అవినాష్ ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు సాధారణ ప్రత్యర్ధికాదని అవినాష్ అంటున్నారు. చంద్రబాబు నేరుగా వచ్చి యుద్ధం చేయడని.. అలాంటి వ్యక్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పార్టీ వర్గాలుకు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ పై విష ప్రచారం చేశారని.. మళ్లీ అదే వ్యూహం అనసరిస్తారని మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు అవినాష్.


మరింత సమాచారం తెలుసుకోండి: