నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని అంటారు. తెలుగుదేశం పార్టీకి ఒక నోరు కాదు, ముఖ్యమంత్రి, మొదలు మంత్రులు, ఏంపీలు, ఎమెల్యేల నుండి క్రింది స్థాయి సాధారణ కార్యకర్త వరకు మూస బోసినట్లు ఒకేరకమైన మాటలతో వారి పాలనను వ్యతిరేఖించిన వారిపై 'నోళ్ళతో పడిపోవటం' నుండి  'రౌడీఇజంతో నోటిదూల చేతిదూల' నేటికి పరాకాష్ట కు చేరింది. చంద్రబాబును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వారు తెలుగుదేశం పార్టీ వారు తప్ప ఎవరూ నమ్మట్లేదు 


చంద్రబాబు ప్రత్యేకహోదాకు సరైన, అంతకు మించిన ప్రత్యేక పాకేజీ తీసుకున్నట్లే నరేంద్ర స్పష్టం చేశారు అయితే ఆ పాకేజిని సరైన విధంగా చంద్రబాబు వినియోగించు కోలేదన్నారు. అందుకే ప్రత్యేకహోదా కోసం ఉద్యమం జరగగా అనేక మందిని జైళ్ళ పాలు చేశారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని అన్నారు. కావలసినన్ని వీడియోలు ఈ విషయంలో యూ-ట్యూబులో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. 
సంబంధిత చిత్రం
తరచుగా నాలుక మడతేసి యూ-టర్న్ తీసుకొనే అలవాటున్న టిడిపికి చంద్రబాబుకు అబద్ధాలాడటం ఒక లెక్క కాదు. గతంలో పలుసార్లు నిరూపించ బడింది. ఈయన స్వార్ధానికి రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా ప్రయోజనాన్ని కోల్పోయారు. 


ప్రత్యేక పాకేజ్ కోసం ప్రత్యేక హోదా అమ్ముకున్న చంద్రబాబును ప్రక్కన పెట్టేయటానికి వీళ్ళకు అడ్డొచ్చే సమస్య ఏమిటి? ఆ ప్రధాన సమస్య పరిష్కరించు కోవలసిన అవసరం ఏపి ప్రజలకు ప్రజాసంఘాలకు ఎంతో ఉంది. చంద్రబాబును ఇప్పటికైనా వదిలేసి నాయకత్వం మనకి లేకుంటే,  కొత్తగా సృష్టించు కోవలసిన పరిస్థితులున్నాయి. ఒక్కసారి నరేంద్ర మోడీని కూడా ప్రక్కన పెట్టేసి  నా ఆయనకు బిజేపికి నష్టం ఏమీ జరగదు. కారణం బిజెపికి ఇక్కడ రాజకీయ స్థానమే లేదు. అందుకే  అజాగళ స్తనాన్ని ఎంత పితికినా పాలు రావు.


అవినీతి బందుప్రీతి కుటుంబ స్వార్ధం సామాజికవర్గ ప్రయోజనాలతో కుళ్ళిపోయిన చంద్రబాబు ఏపికి చేసేది శూన్యం.  అందుకే చంద్రబాబును తప్పించి ఉవ్వెత్తున ప్రత్యేక హోదా కోసం ఉద్యమం నిర్ఫ్మిస్తే తప్ప ప్రత్యేక హోదా ప్రయోజనం సిద్ధించదు. ఇక్కడ బాబుగారి రాజకీయ ప్రయోజనాలే రాష్ట్రానికి దాని అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి.  

why people of AP to sacrify for Lokesh to become leadr కోసం చిత్ర ఫలితం

ఈ క్రింది విషయాలు గమనిస్తే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహాల పరంపర కనిస్తూ ఉన్నా చలసాని శ్రీనివాస్, శొంఠినేని శివాజి లాంటి వాళ్లు ఆయనకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో?  వీళ్ళేంటో? ఎందుకు బాబుకు మద్దతు ఇస్తున్నారో? తెలుసుకోలేని స్థాయిలో ఏపి ప్రజలు లేరు.   


ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు బుక్కయి పోవటం తద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పదేళ్ళ ఉచిత ఉమ్మడి రాజధాని ఏర్పాటుని తప్పుడు నిర్ణయంతో వదిలేశారు. అది లక్షల కోట్ల విభజన ప్రయోజనం. చంద్రబాబు స్వార్ధం సంకుచిత రాజకీయ ప్రయోజనం కుడి ఎడమల రాష్ట్రాన్ని ముంచేసింది. ఈ విషయంలో పచ్చ మీడియా నోరెత్తదు. అదే చంద్రబాబు లోకేష్ ఏ చిన్న చిలకపలుకులు పలికినా వేల గొంతుకలతో ప్రచారం చేస్తాయి.  ఉమ్మడి రాజధాని వదిలెయ్యటం, తాత్కాలిక నిర్మాణాలతో ప్రజాధనాన్ని దోచెయ్యటం, ఇదే చంద్రబాబు సిద్ధాంతం 
vote for note case and chandrababu కోసం చిత్ర ఫలితం
ప్రత్యేక హోదాని ప్రత్యేక పాకేజికి అమ్మెసుకున్నట్లు మనందరికి తెలిసిందే.  ప్రత్యేక పాకేజి కోసం ప్రత్యేక హోదా వదిలెయ్యటం ఏపి ప్రజలు సహించలేదు. నాడు ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పొంగి నప్పుడు ఉద్యమకారులను రాష్ట్ర పోలీసులు తుక్కురేగ్గొట్టారు, జైళ్ళలో కుక్కారు అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.  

chandrababu comments on note bandhi కోసం చిత్ర ఫలితం

పోలవరం ప్రోజెక్ట్ నిర్మాణ భాధ్యత కేంద్రానిది. అందులో చంద్రబాబు వెలుపెట్టటం కమీషన్లు, గుత్తేదారల ప్రయోజనం కోసమేనంటున్నారు అన్నీ ప్రతిపక్షాల వాళ్లు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లు నీది కాని పనిలో నీవు వేలు పెడుతున్నావంటే నీ స్వార్ధపరత్వం జనమెరగని విషయమా! ఇప్పుడు పోలవరం పూర్తి కానందున రాష్ట్రం నరేంద్రమోడీని ప్రశ్నించే హక్కు కోల్పోయింది.


నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకోపోతే మరో పదిసీట్లు ఎక్కువ వచ్చేవని చెప్పే చంద్రబాబు ను నాడు పొత్తుకోసం పాకులాడింది మోడీ కాదని చంద్రబాబే నని అందరికీ తెలిసిన విషయమే. ఆఖరకు పవన్ తో కూడా అదే జరిగింది. అప్పటి దాకా ఎందుకు - ఇప్పుడు సైతం పవన్ కళ్యాన్ తో పొత్తు కోసం ఎవరు పాకులాడు తున్నారో? మనందరికి తెలుసు. కాంగ్రెస్ తో టిడిపి పొత్తంటే అది వావి వరసలు లేని సంసారం అని చెప్పొచ్చు.


నాడు నోట్ల రద్ధు నిర్ణయం పొగిడి,  క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు, అదే నోట్ల రద్ధు అమలు కమిటీకి కన్వీనర్ గా కూడా ఉన్నారు . నేడు నోట్ల రద్ధు పిచ్చి తుగ్లక్ చర్య అనటం దుర్మార్గం కాదా!  వ్యాపారవర్గాల్లో ఉన్న ప్రచారం ఏ మంటే కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు సన్నిహిత వర్గాలు ఈ పెద్ద నోట్ల రద్ధు ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందారని అంటుంటారు.  


చంద్రబాబును నరేంద్ర మోది తిట్టటానికి వస్తున్నట్లు బాబు చెప్పినా మోడీ ఆయన్ని ఏ విషయం లోనూ తిట్టలేదు సరికదా!  అన్నిటికి సమాధానాలు చెప్పారు. కొన్నింటిని తిప్పి కొట్టారు. ఇంకా దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వం పాటించ వలసిన కనీస ప్రొటోకాల్ కూడా పాటించలేదు. అంటే మీరన్నట్లు మీ వ్యక్తిగత సంబంధాలు అంత బాగున్నట్లు లేవనే తెలుస్తుంది. నరేంద్ర మోడీ తో చంద్రబాబు ప్రవర్తన వాళ్ళ మద్య సన్నిహిత సంబంధాలు పూర్తిగా బెడిసిపోవటానికి కారణమై ఉందనిపిస్తుంది. సీనియారిటీ విషయం,  సోదాహరణం గా చంద్రబాబు స్వభావాన్ని విశదీకరించారు నరేంద్ర మోడీ. 

cbn said special package is better than special status కోసం చిత్ర ఫలితం

నరేంద్ర మోదీ అసలు ఎందుకు వచ్చివెళ్ళారో అర్ధం కావటం లేదంటున్న లోకెష్ విఙ్జత అర్ధ మౌతూనే ఉంది. చంద్రాబాబు లోకెష్ తండ్రి కొడుకులను వారి రాజకీయాలను చూసి వెళ్లటానికే వచ్చారు. ఆయన ఆగమనాన్ని మీరెలా స్వీకరిస్తారనేది ఆయన అర్ధం చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో సిబీఐ ప్రవేశ నిషేధం తోనే రాష్ట్రంలో అవినీతి స్థాయి వారికి అర్ధమ వగా, ప్రజలు ఏమంటున్నారనేది కూడా అర్ధం చేసుకోవటానికి ఇప్పుడు వచ్చారనుకోవచ్చు. చంద్రబాబు పరువు ప్రతిష్ఠలు అత్యంత నిమ్న స్థాయికి దిగజారిందో మోడీకి అర్ధమై ఉండవచ్చు.


ఎవరు మోడీ గో బాక్ అన్నారు ఏవరు నల్లబలూన్లు ఎగరేశారో తెలుసు కున్నారు. తెలుగుదేశం పార్టీ వారు, వారి అనుయాయులు, తండ్రి కొడుకులు వారి బందుబలగం, సామాజిక వర్గ జనం ఆయనకు కనిపించారు. 

special status sold for package కోసం చిత్ర ఫలితం

అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వైసిపి ఎమెల్యేలను, ఎంపిలను చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా కొనేసిన వైనం ఏపి ప్రజలకు తెలిసిన విషయమే.  అలాగే నారా లోకెష్ ను ఎమెల్సీ ఆపై మంత్రిని చేసి ఇప్పుడు సరాసరి యువరాజుని చేసేశారు చంద్రబాబు.  లోకెష్ తండ్రిగా మోదీ మిమ్మల్ని గుర్తించారంటే లోకెష్ ను గురించి ఆయన దగ్గర చాలా సమాచారము ఉందని పిస్తుంది. ప్రస్తుతానికి  పుత్రొత్సాహంతో గర్వపడే సందర్భాలు చంద్రబాబుకు ఇంకా ఇప్పటికి లేనే లేవు. ఆయన ఇంత వరకు ప్రజల నుంచి ఎన్నిక కాలేదు.


రకరకాల దీక్షలపేరుతో వందల కోట్ల ప్రజాధనం దుబారాగా ఖర్చు చెయటం రాష్ట్రానికి చంద్రబాబు చేసే అన్యాయం  కదా!  మీ దుర్మార్గ దుబారాకు ప్రజాధన దుర్వినియోగానికి మోడీ దగ్గర లెక్కలు ఉన్నట్లున్నాయి. రానున్న కాలంలో అవి బయట పడవచ్చు.


చంద్రబాబు - ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక పాకేజి అంగీకరించటం శాసనసభలో ప్రకటించటం వెంకయ్య నాయుడుకు కేంద్ర మంత్రికి సన్మానాలు చెయ్యటం జరగ లేదా!


ఇవన్ని పరిశీలిస్తే మోడీ రాష్ట్రానికి చేసిన ద్రోహం కంటే ముఖ్యమంత్రిగా సీనియరుగా, సుధీర్ఘ నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు.  

modi vs all images of leaders with chandrababu కోసం చిత్ర ఫలితం

ఒకే రంగు ఈకలున్న పక్షులు ఒక చోటికే చేరతాయి అన్నదానికి - పెద్ద ఉదాహరణ - పై గ్రూప్ ఫొటో 

మరింత సమాచారం తెలుసుకోండి: