ఢిల్లీ దీక్షలో చంద్రబాబునాయుడు ఒంటరైపోయారు. చంద్రబాబు చేస్తున్న దీక్షలో పాల్గొనేది లేదని వామపక్షాలు ప్రకటించి షాక్ ఇచ్చాయి. రాష్ట్రప్రయోజనాలని, ప్రత్యేకహోదా అని చంద్రబాబు నానా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలో చంద్రబాబు దీక్ష ప్రారంభించబోతున్నారు. దీక్షను అడ్డుపెట్టుకుని చంద్రబాబు పెద్ద డ్రామానే ఆడుతున్నారు. నాలుగేళ్ళపాటు ఎన్డీఏలో ఉన్నంత కాలం కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రత్యేకహోదా కోసం ఆందోళన అంటేనే కేసులు బుక్ చేసి జైళ్ళల్లో పెడతామని బహిరంగంగానే హెచ్చరించిన ఘనుడు చంద్రబాబు.

 

అటువంటి చంద్రబాబు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకహోదా అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. నిజానికి హోదా డిమాండ్ సజీవంగా ఉందంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డే అనటంలో సందేహం లేదు. అటువంటి హోదా వల్ల జగన్ ఎక్కడ లబ్దిపొందుతారో అన్న భయంతోనే ఇఫుడు చంద్రబాబు యుటర్న్ తీసుకున్నారు. హోదా కోసం మొదటి నుండి పోరాడుతున్నది తానే అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు.

 

అప్పట్లో హోదా కోసం జరిగిన ఆందోళనల్లో వైసిపి, వామపక్షాల శ్రేణులపై పోలీసులు కేసులు పెట్టారు. అందుకే వామపక్షాలు ఇపుడు చంద్రబాబుతో కలవటానికి ఇష్టపడలేదు. హోదా కోసం చేసిన ఆందోళనల తాలూకు కేసులు ఇంకా తమను వేధిస్తున్నాయని వామపక్షాల కార్యదర్శులు మధు, రామకృష్ణ చెప్పారు. ఉద్యమాలు చెయ్యాల్సిన సమమంలో  చెయ్యకుండా ఎన్నికల్లో లబ్దికోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నట్లు మండిపడ్డారు. వామపక్షాల సంగతి పక్కనపెడితే వైసిపి, బిజెపి, కాంగ్రెస్, జరసేన కూడా దీక్షకు మద్దతివ్వటం లేదు. జాతీయపార్టీల అధినేతలు కొందరైనా వచ్చారంటే దీక్ష ఢిల్లీలో జరగబట్టే అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఢిల్లీ దీక్షలో చంద్రబాబు ఒంటరైపోయినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: