ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఏపి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఒక పోస్టర్‌పై పెద్ద దుమారం  చెలరేగడంతో, టీడీపీ నేతలు ఆ వివాదాస్పధ పోస్టర్‌ను అక్కడి నుంచి తొలగించింది. 
chai vala postar by TDP కోసం చిత్ర ఫలితం
ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష చేయటం ఎంత దుర్మార్గం 


ఢిల్లీలోని ఏపి భవన్ వేదికగా ధర్మ పోరాట దీక్ధకు దిగారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ దీక్ష చేపట్టారు.  అయితే ఈ నిరసన కార్య క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకొంటూ టీడీపీ ఏర్పాటు చేసిన పోస్టర్‌పై దుమారం రేగింది. 


ధర్మపోరాట దీక్షావేదిక పక్కన నంది విగ్రహం ఎదురుగా  “చాయ్-కప్” ను ఉంచి - ప్లకార్డుపై ‘ఎవరి చేతి కైతే తాగేసిన టీ కప్పు ఇవ్వాలో, వారి చేతికి ప్రజలు దేశాన్ని అప్పగించారు  అంటూ ( जिसके हाथ में चाय का झूठा कप देना था, उसके हाथ में जनता ने देश दे दिया విమర్శించారు. 

ఈ పోస్టర్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీని టీడీపీ నేతలు అవమానించారంటూ ఎదురు దాడికి దిగింది.  దేశ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదా! టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమంటూ నిప్పులు చెరిగారు ఆ పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై వివాదం చెలరేగడంతో, టీడీపీ నేతలు ఆ వెంటనే ఆ పోస్టర్‌ను అక్కడి నుంచి తొలగించారు. పోస్టర్‌ను అక్కడి నుంచి తొలగించినా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌ గా మారింది. 
chai vala postar by TDP కోసం చిత్ర ఫలితం



దేశ ప్రధానిని ఇలా అవమానిస్తూ అదే ప్రధాని నుండి రాష్ట్ర విభజన ప్రయోజనాలు సాధించాలను కోవటం ధర్మమా? న్యాయమా? అంటున్నారు.  అసలు బాబులోని నైచ్యానికి పరాకాష్ఠ ప్రజా ధనానికి లెక్కలు చెప్పమని అడగకుండా లెక్కలు సమర్పించాల్సిన బాధ్యత మరచిన వ్యక్తికి లెక్కలు చెప్పమంటే కూడా స్పందించక పోగా – ముందు మీరు మా రాష్ట్రం నుండి వసూళ్ళు చేసిన పన్నుల లెక్క అడగటం పరమ దుర్మార్గమే కాదు నైచ్యం కూడా!

అయితే ఇక్కడ నరెంద్ర మోడీది ఎంత నేరమో, ఖచ్చితంగా చంద్రబాబుదీ అంతే  నేరం.  వెంటనే కేంద్రం రాష్ట్రానికి వివిధ పథకాలను ఇచ్చిన సొమ్ము - దాన్ని రాష్ట్రం ఖర్చు చేసిన విధానం పై విచారణ సంఘం నియమించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: