ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే! మోదీ గుంటూరులో సభ పెట్టి చంద్రబాబును తిట్టి వెళ్లిన మరుసటి రోజే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కోసం పలువురు జాతీయ నేతలను కూడగట్టారు. అనుకున్నట్టే చాలా మంది నేతలు చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కూడా వచ్చి చంద్రబాబుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వెళ్లారు. అయితే చంద్రబాబుకు రాహుల్ ఊహించని విధంగా నష్టం కలిగించారు.

Image result for babu delhi deeksha

          చంద్రబాబుకు రాహుల్ నష్టం కలిగించడమేంటనే సందేహం రావచ్చు. కానీ ఇది నిజం. ఢిల్లీలో దీక్ష చేపట్టడం ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవం, ప్రత్యేక హోదా డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది. పైగా రాహుల్ సహా, పలువురు జాతీయ పార్టీల నేతలు తన దీక్షాస్థలికి రావడం వల్ల దాని ప్రభావం చాలానే ఉంటుందనుకున్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఇలాగే ప్లాన్ వేస్తారు. తను ఏ పని చేసినా ప్రచారం మాత్రం హోరెత్తిపోవాలనుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ దీక్షకు కూడా అలాగే ప్లాన్ వేశారు.

Image result for babu delhi deeksha

చంద్రబాబు ప్లాన్ కు తగ్గట్టే ఉదయం దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పలువురు నేతలు ఒక్కొక్కరుగా వచ్చి వెళ్లారు. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ములాయంసింగ్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ యాదవ్, శరద్ పవార్, కేజ్రివాల్ .. ఇలా ఎంతో మంది నేతలు చంద్రబాబు దీక్షకు మద్దతు పలికారు. తాము ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. మాట్లాడిన వారందరి నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఉపశమన వ్యాఖ్యలే లభించాయి.

Image result for priyanka gandhi rally in lucknow

అయితే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు దీక్షకు తగినంత మైలేజ్ రాకుండా అడ్డుపడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ సోదరి ప్రియాంకా వాధ్రా ఇవాళ లక్నోలో ర్యాలీ చేపట్టారు. దీనికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఉత్తరప్రదేస్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి ర్యాలీ కావడంతో నేషనల్ మీడియా ఫోకస్ అంతా ప్రియాంక వైపే మళ్లింది. దీంతో చంద్రబాబు దీక్షకు నేషనల్ మీడియాలో అంత ఫోకస్ దక్కలేదు. పలు ఛానళ్లు చంద్రబాబు ఇంటర్వ్యూలు తీసుకోవడం కనిపించింది. కానీ లైవ్ మాత్రం అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. ఇలా చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. లేకుంటే ఇంకొంచెం బెటర్ కవరేజ్ చంద్రబాబుకు దక్కి ఉండేది. పాపం..!!


మరింత సమాచారం తెలుసుకోండి: