ఇది నిజంగా నిజమే. ఏపీకి సంబంధించి జనాలు ఎవరూ వూహించలేని వార్తే. ఉప్పూ నిప్పులా ఉండే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మధ్యలో ఇలాంటివి ఉంటాయని ఎవరూ అనుకోలేరు కూడా. అయితే అక్కడ ఉన్నది చంద్రబాబునాయుడు. ఆయన తలచుకుంటే ఏమైనా చేయగలరు.


మాతో జగన్ కలవాలి :


డిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఎవరినైనా కలుపుకుని పోతానని అన్నారు. ఈ విషయంలో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పుకొచ్చారు. జగన్ తో కలసి పోరాటం చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా బాబు అన్నారు. ఏపీ ఇపుడు చాల కష్టాల్లో ఉంది. అనేక ఇబ్బందులు పడుతోంది. ఈ సమయంలో అంతా ఒక్క త్రాటిపైకి రావాలి. జగన్ ఆయన పార్టీ కనుక ముందుకు వస్తే తమ పోరాటం మరింత ఉధ్రుతం చేస్తామని బాబు అన్నారు. ఇలా అంటూనే బాబు మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. జగన్ని తాను పిలుస్తానని, ఐతే,  ఆయన రారు అని అనడం విశేషం. జగన్ ఇప్పటికే మోడీ వలలో చిక్కుకున్నారని ఆయన వారిని విడిచి తమ వైపునకు రావడం కష్టమని కూడా బాబే చెప్పడం గమనార్హం.


ఇదీ వ్యూహమేనా :


నిజానికి ఏపీలో ప్రత్యేక హోదా పొరాటం మొదలుపెట్టిందీ  వైఎస్  జగన్. ఆనాడు తమతో కలసి రావాలని జగన్ బాబును పదే పదే కోరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే జగన్ తో కలవడమేంటి, ఆయన ఆర్ధిక నేరస్తుడు  అంటూ బాబు అండ్ కో ఆనాడు నిందించి   మరీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కన పెట్టారు. ఇక అవిశ్వాసం  కేంద్రంపై పెట్టే వేళ కూడా జగన్ బాబుకు ఇలా  విన్నపాలు ఎన్నో చేశారు. మీరే అవిశ్వాసం  పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పారు. 
అయితే అపుడు కూడా బాబు దాన్ని తోసిపుచ్చుతూ అవిశ్వాసం పెట్టే బలం తమకు లేదని, జగన్ తో కలసి అసలు పెట్టమని ఖరాఖండీగా చెప్పేసి ఆ తరువాత జగన్ పార్టీ అవిశ్వాసం మోడీపై పెట్టిన వెంటనే తమ వ్యూహాన్ని అమలు చేస్తూ పోయారు. ఇలా బాబు ఎపుడూ రాజకీయాలకే పెద్ద పీట వేశారు తప్ప ప్రత్యేక హోదా కోసం, ఏపీ ప్రయోజనాల కోసం కలసి రాలేదన్నది వైసీపీ నేతల వాదన. ఇపుడు కూడా బాబు బయటకు ఇచ్చిన పిలుపు ఏపీ ప్రజల ద్రుష్టిలో  జగన్ని చెడ్డ చేయడానికి తప్ప నిజంగా కాదన్నది వారి మాట. మొత్తానికి బాబు అందరినీ కలుపుకుంటున్నారు,  ఇక జగనే మిగిలారులా ఉందన్న సెటైర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: