సెంటిమెంట్లు లేని రంగం లేదు. అసలు మనిషి పుట్టుక నుంచి చచ్చేవరకూ అన్నీ సెంటిమెంట్ల మీదనే ఆధారపడుతున్నాయి. ఒకరికి అలా వెళ్తే మంచి  జరిగిందని అనుకుంటే మరోకరు అక్కడికే వెళ్తారు. ఇక ఏపీ విషయానికి వస్తే సెంటిమెంట్లు ఎక్కువగా రాజకీయ నేతల్లో కనిపిస్తాయి. ఇపుడు అదే విషయం చర్చగా ఉంది.


డిల్లీ  దీక్ష  అచ్చిరాదా :


గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సమైఖ్యాంధ్ర పేరిట డిల్లీలో దీక్ష చేపట్టారు. సరిగ్గా ఎన్నికల సమయం చూసుకుని కిరణ్ చేపట్టిన నాటి  దీక్ష  వల్ల ఆయనకు ఒనకూడినది ఏం లేదు. పైగా కిరణ్ సొంతంగా పార్టీ పెట్టి మరీ ఓటమి పాలు అయ్యారు. ఇపుడు చంద్రబాబు డిల్లీలో దీక్ష చేపట్టారు. అది కూడా అధికారాంతమున. ప్రత్యేక హోదా అంటూ బాబు చేపట్టిన ఈ దీక్ష తరువాత ఏం జరుగుతుంది. ఆ యాంటీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే పరిస్థితి ఏంటి. ఇదీ ప్రస్తుతం టీడీపీని వేధిస్తున్న ప్రశ్న


అచ్చం అలాగే :


నాడు కాంగ్రెస్ ని ధిక్కరించి సీఎం హోదాలో కిరణ్ దీక్ష చేపడితే నేడు బీజేపీని, మోడీని దిక్కరించి చంద్రబాబు దీక్ష చేపట్టారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం తనను కాస్తుందని కిరణ్ భ్రమించారు. ఆ ఉద్యమాన్ని కూడా ఆయన ఆఖరులో చేతుల్లోకి తీసుకున్నారు. ఇపుడు ప్రత్యేక హోదా కూడా బాబు చివర్లో తీసుకుని డిల్లీ వీధుల్లో హోరెత్తించారు. హోదా వల్ల తనకు రాజకీయ మైలేజ్ వస్తుందని మళ్ళీ పీఠం దక్కుతుందని బాబు ఆశ పడుతున్నారు. కానీ గత అనుభవం సెంటిమెంట్ చూస్తే డిల్లీ దీక్ష తరువాత కిరణ్ కనుమరుగు అయ్యారు. మరి బాబు దీక్ష ఆయన్ని ఎక్కడికి చేరుస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: