ఏపీలో ఓ రేర్ సీన్ క్రియేట్ అవుతుందా లేదా అన్న దానికి కొద్ది గంటలు ఆగితే సరిపోతుంది. ఏపీలో చంద్రబాబు, జగన్ ఈ ఇద్దరూ కీలకమైన స్థానాల్లో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రిగా, మరొకరు ప్రతిపక్ష నాయకునిగా ఏపీకి రెండు కళ్ళుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్యన సయోధ్య లేదు, రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగానూ విడిపోయారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఓ విషయమై హాట్ హాట్ డిస్కషన్ ఏపీలో  జరుగుతోంది.


బాబుని పిలుస్తారా :



వైఎస్ జగన్ అమరావతిలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. దాని హంగూ ఆర్భాటం చూడడానికి రెండు కళ్ళూ చాలవంటున్నారు. ఈ నెల 14న మంచి ముహూర్తం చూసుకుని మరీ జగన్ గ్రుహప్రవేశం చేయబోతున్నారు. మరి ఈ శుభ కార్యానికి హాజరు కావాలని జగన్ ఇప్పటికే తెలంగాణా సీఎం కేసీయర్ కి ఆహ్వానం పంపారు. అలాగే పలువురు ప్రముఖులకు కూడా ఆయన ఇన్విటేషన్లు పంపినట్లుగా తెలుస్తోంది. మరి అందరినీ పిలిచిన జగన్ ఏపీ సీఎం చంద్రబాబుని పిలుస్తున్నారా..


అది జరిగేనా :


ఒకవేళ ఏపీ సీఎం చంద్రబాబుని జగన్ ఆహ్వానించినా ఆయన హాజరు అవుతారా అన్నది కూడా ఇక్కడ చర్చగా ఉంది. నిజానికి జగన్ బాబు ముఖాముఖాలు చూసుకుని రెండేళ్ళు దాటుతోంది. 2017 బడ్జెట్ సెషన్ తరువాత జగన్ అసెంబ్లీకి రావడం మానుకున్నారు. అయితే రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అనుకుంటే మాత్రం జగన్ పిలుస్తారని అంటున్నారు. జగన్ పిలిస్తే మాత్రం తప్పకుండా బాబు హాజరు అవుతారని అంటున్నారు. ఒకవేళ బాబు హాజరైతే  మాత్రం అది రేర్ సీన్ అనాల్సిందే. అక్కడ కేసీయార్, జగన్, బాబు ముగ్గురూ ఉంటే మాత్రం నేషనల్ న్యూసే అవుతుంది. ఇంతకీ జగన్ పిలుస్తారా...


మరింత సమాచారం తెలుసుకోండి: