ఓటుకునోటు కేసులో ఈడీ విచారణ స్పీడవుతున్నట్లే ఉంది. ఈరోజు వేం నరేందర్ రెడ్డిని చాలాసేపు ఈడి అథికారులు విచారణ జరిపారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ఇవ్వచూపిన రూ 50 లక్షలు గురించే అధికారులు ప్రధానంగా వేంను ప్రశ్నించినట్లు సమాచారం.  ఇవ్వచూపిన అడ్వాన్స్  రూ 50 లక్షలు ఎక్కడివి ? బేరం కుదుర్చుకున్న రూ. 5 కోట్లు ఎక్కడివి ? ఎవరి ఖాతా నుండి వచ్చాయన్న విషయంపైనే విచారణ సాగింది. సో ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా సరే అడ్వాన్స్ ప్లస్ మొత్తం 50 లక్షల విషయం బయటకు రాక తప్పదనే అనిపిస్తోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఓటుకునోటు విచారణ స్పీడవుతోంది. ఈ కేసులో అందరికీ కనిపించిన పాత్రలైతే అప్పటి ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జరుసలేం ముత్తయ్య, ఉదయసింహ. ఇక తెరవెనుక పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి సూత్రదారి చంద్రబాబునాయుడే అని స్వయంగా తెలంగాణా సిఎం కెసియారే ఎన్నోసార్లు చెప్పుంటారు. కాబట్టి వేం విచారణలో గనుక 50 లక్షల గుట్టు విడిపోతే తర్వాత బయటపడేది సూత్రదారుల పాత్ర గురించే.

 

అందుకే ఓటుకునోటు కేసు విచారణ ముందకు వెళ్ళకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు మోకాలడ్డుతున్నారు. ముఖ్యంగా తనను ఏసిబి విచారణ జరపకుండా ముందుజాగ్రత్తగా కోర్టు నుండి చంద్రబాబు స్టే కూడా తెచ్చుకున్నారు. తెరవెనుక జరిగిన పెద్దమనుషుల ఒప్పందాల వల్ల కేసు విచారణ కూడా కోల్డు స్టోరేజిలో ఉండిపోయింది. అటువంటిది ఇపుడు హఠాత్తుగా విచారణ  స్పీడయ్యేటప్పటికి టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇటుచూస్తే ఏపిలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వబోతోంది. అదే సమయంలో ఓటుకునోటు కేసు స్పీడవుతోంది. దాంతో కేసు విచారణ టిడిపిలో ఎవరి కొంప ముంచుతుందో అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: