ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు వైసిపి టిడిపి పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో దీక్ష చేపట్టిన చంద్రబాబు చేసిన ప్రసంగం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.

Image result for ysrcp flag

ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు మా వాడే అంటూ ప్రసంగించారు.  గులాం నబీ ఆజాద్, మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ దశాబ్దాలపాటు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా వున్న శరద్ పవార్ వీరంతా చంద్రబాబు తో తమ అనుబంధం ఈనాటిది కాదని తేల్చి చెప్పారు.

Image result for chandrababu rahul at delhi diksha

తామంతా యూత్ కాంగ్రెస్ టీం అంటూ తెలిపారు. వారి ప్రసంగాల తరువాత బాబు సైతం తమ మధ్య బంధాన్ని జోష్ లో ఆవిష్కరించారు. గులాం నబి అయితే తన పెళ్ళికి మూడు రోజులు వచ్చి ఉండిపోయారని గోల్డెన్ డేస్ లోకి వెళ్లిపోయారు.

Image result for chandrababu rahul at delhi diksha

ఎవరు ఎక్కడ వున్నా మా స్నేహాలు కొనసాగుతూనే వస్తున్నాయని, రాజకీయాలకు వాటికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను వైసిపి పార్టీ కొత్త అస్త్రంగా మలుచుకుని సోషల్ మీడియాలో సెటైర్ల పైన సెటైర్లు వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం జగన్ని జైల్లో అన్యాయంగా పెట్టించడం ఇదంతా చంద్రబాబు కాంగ్రెస్ కలిసి చేశాయని తెగ కామెంట్లు చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: