వైసీపీ పార్టీ అధినేత ఇటీవల నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతం తాడేపల్లి లో నూతనంగా కట్టించుకుంటున్న గృహంలో ఈనెల 14వ తారీఖున గృహప్రవేశం చేస్తున్నట్లు ఇటీవల తెలుగు మీడియా మరియు వైసీపీ పార్టీ కి చెందిన కొంతమంది నేతలు ప్రకటనలు చేశారు.

Image result for jagan

ఇప్పటికే జగన్ నూతన గృహము మరియు పార్టీ కార్యాలయం నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది. అయితే గృహప్రవేశం చేయాల్సిన నేపథ్యంలో పార్టీ నేత‌లు అంద‌రూ హాజ‌రుకావాల్సిందిగా ఆహ్వానాలు కూడా పంపించారు.

Related image

అయితే, ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌, బావ అనీల్ అనారోగ్యంతో ఉండ‌టంతో గృహ‌ప్ర‌వేశ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసినట్లు త్వరలోనే నూతన గృహ ప్రవేశ తేదీన కూడా ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

Image result for jagan

అయితే జగన్ రాక రాష్ట్రంలోకి రావడంతో వైసీపీ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తమ నాయకుడు గతంలో హైదరాబాదు నగరంలో ఉండటంతో చాలామంది పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఏదైనా విషయం చెబుదామంటే కొంత కష్టంగా ఉన్న తరుణంలో తాజాగా జగన్ రాజధాని ప్రాంతంలో కి స్థిర నివాసం ఏర్పరచుకోవడం తో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: