అవును తెలుగుదేశంపార్టీలో సినీ హీరోయిన్ల వ్యవహారం కరేపాకు లాగే అయిపోయింది. పార్టీ పెట్టిన కొత్తల్లో చేరిన అలనాటి అందాల హీరోయిన్ జయప్రద మాత్రమే తన ఉనికిని చాటుకోగలిగారు. తర్వాత రోజా కూడా బాగా యాక్టివ్ గానే ఉండేవారు. 1995లో జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబునాయుడు దెబ్బకు జయప్రద అడ్రస్ లేకుండా పోయారు. అంటే వాడుకుని తర్వాత వదిలేయటమనే చంద్రబాబు కాన్సెప్టుకు జయప్రద కూడా బలైంది. సరే చాలా కాలం తర్వాత సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా యాక్టివ్ గానే తిరిగారు. తర్వాత తనపై జరుగుతున్న అణచివేతకు, చంద్రబాబు మాయకు బలైపోయిన రోజా కూడా టిడిపిని వదిలేసి వైసిపిలో చేరారు.

 

తర్వాత కవిత, జీవితచ వాణీ విశ్వనాధ్, ఇలా చాలామందే టిడిపిలో చేరారు తర్వాత ఏమయ్యారో కూడా తెలీకుండా కనుమరుగైపోయారు. అంటే వాళ్ళంతా ఆటలో అరటిపండనో లేకపోతే కరివేపాకుగానో చంద్రబాబుకు ఉపయోగపడ్డారు. వాళ్ళు లాభం లేదని తేలిపోగానే వాళ్ళని కన్వీనియంట్ గా వదిలించుకున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, కొత్త కరివేపాకుగా దివ్యవాణి కనిపిస్తోంది. చంద్రబాబు చేసిన ఢిల్లీ దీక్షలో ఒక్కసారిగా నరేంద్రమోడిని నోటికొచ్చినట్లు ఏకిపారేసింది. తనేం మాట్లాడుతోందో కూడా అర్ధంకానంత రేంజిలో మైకులో మోడిని ఎడాపెడా తిట్టేసింది.

 

కొంపతీసి రాబోయే ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తోందో ఏమో అర్ధం కావటం లేదు. ఆమధ్య అమరావతిలో సహజనటి జయసుధ కూడా చంద్రబాబును కలిశారు. తర్వాత ఏమైందో తెలీదు. అంతకుముందే అలనాటి హాస్యనటి గీతాంజలి కూడా టిక్కెట్టుకు ట్రై చేసుకున్నారు. కవిత అయితే విశాఖపట్నంలో పోటీకి రెడీ అన్నారు. ఆమధ్య శారద కూడా చీరాల ఎంపిగా ఒకసారి గెలిచారు. అంటే అందరు కూడా ఏదో ఒకసారి లేకపోతే కొద్ది రోజులు మాత్రమే కనబడి తరువాత కనుమరుగైపోయారు. బహుశా కొత్త కరేపాకు దివ్యవాణి ఎంతకాలం ఉంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: