ఏపీలో ఎన్నికలకు అట్టే సమయం లేదు. ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ డీ  కొడుతున్నాయి. కొత్తగా వచ్చిన జనసేన కూడా రెడీ అంటోంది. అయిదేళ్ళు పాలించిన టీడీపీ మరో మారు అధికారం కోరుకుంటోంది. గత ఎన్నికల్లో అయిదు లక్షల ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈసారి తమకే చాన్స్ ఇవ్వలాంటోంది. ఆ రెండు పార్టీలతో విసిగిన జనం తమను ఆదరించాలని జనసేన ముందుకు వస్తోంది.


జోరు మీదున్నారుగా :


ఇక ఈ ఏడాది మొదట్లో వరకూ అధికార టీడీపీ బాగా వెనకబడి ఉంది. పాదయాత్ర జోష్ లో ఉన్న వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. జనవరి 9న జగన్ పాదయాత్రం బారీ అట్టహాసం మధ్యన ముగిసేంతవరకూ వైసీపీ హైప్ అలాగే సాగింది. ఆ తరువాత రెండు రోజులకు అంటే జనవరి 11న నెల్లూరు జన్మభూమి సభలో చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. సామాజిక పించన్లు రెండింతలు చేస్తున్నట్లు చేసిన ఆ ప్రకటన ఒక్కసారిగా టీడీపీని ముందుకు తీసుకువచ్చినట్లైంది. 
ఇక అదే వరసలో డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు, బీసీలకు వరాలు, రైతులకు భరోసా, నిరుధ్యగ బ్ర్థుతి రెండింతలు పెంపు ఇల్లా ఒక్కోటీ ఇస్తూ టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెచుకుంది. మరో వైపు ప్రత్యేక హోదా అస్త్రాన్ని ఎప్పటికపుడు పదును పెడుతూ బాబు చేస్తున్న పోరాటం డిల్లీ వరకూ వెళ్ళింది. అక్కడ పతాక సన్నివేశం తో బాబు హోదా పై పోరాడే పార్టీగా ముద్ర వేసుకున్నారు. మొత్తానికి గత రెండు నెలలుగా వరసగా టీడీపీ చేస్తున్న పనులు, దూకుడుతో ఆ పార్టీ గ్రాఫ్ బాగానే పెరిగిందని అంటున్నారు.


వైసీపీ వెనకనేనా :


అదే సమయంలో పాదయాత్ర తరువాత వచ్చిన హైప్ ని నమ్ముకుని వైసీపీ అలాగే గమ్ముండిపోయందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా వంటి అతి కీలకమైన అంశంపై  వైసీపీ ఈ మధ్య కాలంలో పోరాటం చేయకపోవడంతో ఆ క్రెడిట్ పార్టీ తానే పోగొట్టుకుంటుందా అన్న సందేహాలు  కలుగుతున్నాయి. బాబు పై దూకుడుగా విమర్శలు చేసిన మోదీ స్థాయిలో ఎన్నడూ వైసీపీ ఇక్కడ చేయలేదన్న మాట కూడా వినిపిస్తోంది. 
తండ్రీ కొడుకున అవినీతి కధను మోడీ వినిపించినంతగా వైసీపీ జనంలోకి తీసుకెళ్ళలేకపోయిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికల సమరోత్సాహం టీడీపీలో కనిపిస్తూంటే వైసీపీలో మాత్రం సరైన వ్యూహాలు లేకపోవడం, సమయానుకూలంగా స్పందించకపోవడం వల్ల బాగా వెనకబడిందన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా  లోపాలను వైసీపీ సరిచేసుకుని పరుగులు తీయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: