టీడీపీలో వైసీపీ మంత్రులు ఉన్నారు. అందుకే దాన్ని సంకీర్ణ సర్కార్ అంటారు విపక్షాలు. అసెంబ్లీ రికార్డుల్లో ఆ నలుగురు మంత్రులు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇక ఈ మంత్రులు వైసీపీ వారు కాక మరేమవుతారు. వీరి సంగతి అలా ఉంచితే టీడీపీ టికెట్ మీద గెలిచిన మంత్రుల్లో కొందరి మీద వైసీపీకి ప్రేమ ఉందా..


గంటాకు ఫ్రీ హ్యాండ్ :


విశాఖ జిల్లాలో బలమైన మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన ఇప్పటికి మూడు మార్లు అసెంబ్లీకి గెలిచి రెండు మార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మరో మారు పోటీకి ఆయన తయారుగా ఉన్నారు. ఈసారి తాను సీటు మార్చే ప్రశ్నే లేదని కూదా గంటా పక్కా క్లారిటీగా చెప్పారు. దాంతో గంటా భీమిలీలి నుంచేనని అంటున్నారు. గంటా వంటి మంత్రి మీద ఇపుడు వైసీపీ ఎవరిని పోటీ పెడుతుందన్నది ఇక్కడ చర్చగా ఉంది.


క్యాండిడేట్ ఏరీ :


భీమిలీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా మీద పోటీకి వైసీపీకి సరైన క్యాండిడేట్ ఇప్పటికీ లేరు. ఎన్నికలు ముంచుకు వస్తున్నా ఆ పార్టీలో ఆ జోష్ ఏ మాత్రం కనిపించడం లేదు. పాదయాత్రలో భాగంగా భీమిలీ నియోజకవర్గంలో పర్యటించిన జగన్ గంటాను ఓడించి తీరుతామని శపధం చేసి వెళ్ళారు. మరి దానికి తగినట్లుగా అక్కడ క్యాండిడేట్ ని పెట్టారా అంటే ఏదీ లేదు. ద్వితీయ శ్రేణి నాయకులే ఇప్పటికీ పార్టీని నడిపిస్తున్నారు. గంటా వంటి బలమైన నేతను ఢీ కొట్టాలనే ఉన్న వాళ్ళు సరిపోరని అందరికీ తెలుసు.
కానీ వైసీపీ మాత్రం భీమిలీని గాలికి వదిలేసింది. మరి గంటా మీద ఎంత ప్రేమ లేకపోతే అలా చేస్తారని పార్టీలోనూ బయటా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి వైసీపీ ఎంతటి బలమైన నేతను పెట్టినా గంటా వ్యూహాల ముందు ఇబ్బందికరమే. అలాంటిది ముందే చేతులు ఎత్తయడం అంటే వైసీపీ ఈ సీటుకు ఏరి కోరి గంటాకు గిఫ్ట్ గా ఇస్తున్నట్లే అనుకోవాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: