టీడీపీ నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు.. తమ మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇలాగే వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తూ బుతులు లంకించుకున్నారు. ఆయన బండబూతులు తిడుతున్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



శ్రీకాకుళం జిల్లాలో కొన్నాళ్లు టీడీపీలో తిరిగిన ఓ కార్యకర్త ఆ తర్వాత వైసీపీ వైపు వచ్చాడు. జోరుగా ఆ పార్టీ తరపున పని చేస్తున్నాడు. ఈ విషయం తన కార్యకర్తల ద్వారా తెలుసుకున్న కూన రవికుమార్.. ఆ వైసీపీ కార్యకర్తకు ఫోన్ చేసి చుక్కలు చూపించారు.



అచ్చు తమ నాయకుడు బాలయ్య తరహాలో సినిమా డైలాగులతో వైసీపీ కార్యకర్తను హడలెత్తించాడు కూన రవికుమార్.. తమ్ముడూ.. ఇప్పటివరకూ ఒక యాంగిల్ మాత్రమే చూశారు.. రెండో యాంగిల్ కూడా చూడాలనుకోవద్దు.. అంటూ వార్నింగ్ ఇచ్చేశారు.



అది కాదండీ.. మీ పార్టీలో డిస్ట్రబెన్స్ తట్టుకోలేక బయటకు వచ్చానండీ అని చెబుతున్నా.. వినలేదు ఎమ్మెల్యే.. ఎవడాడు డిస్ట్రబెన్స్ ఏంట్రా.. ఏం.. పీ.. ఏం మాట్లాడుతున్నావ్.... తమాషా మాట్లాడుతున్నావా.. అంటూ వినలేని.. రాయలేని బాషలో బూతులు మాట్లాడారుఈ విషయం తెలిస్తే సాక్షి మీడియా ఊరుకుంటుందా.. ఈ ఆడియోను తమ ఛానల్లో ప్రసారం చేసి కూన వ్యవహారాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.



ఇప్పుడు ఈ వీడియో లింక్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. మీ అమ్మ కాదు.. మీ మేనమామ కాదు.. ఎవరువచ్చినా నేను తగ్గను.. తెలుగుదేశం జండా పట్టుకోకపోతే.. ఎక్కడ పాతేస్తానో నాకు తెలుసు.. అంటూ రెచ్చిపోయిన కూన వాయిస్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: