షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ చంద్రబాబునాయుడులో అక్కసు పెరిగిపోతోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. వైసిపిని చంద్రబాబు బురదపాముతో పోల్చారు. బిజెపి అన్నది చచ్చినపామట. కాబట్టి దాన్ని ఇంకా కొట్టి లాభం లేదన్నది చంద్రన్న థియరీ. వైసిపి ఏమో బురదపమట. ఈ బురదపాముతోనే రాష్ట్రానికి ప్రమాదమట. మనసులో ఎంత కోపం లేకపోతే  ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆ విధంగా మాట్లాడుతున్నారో అందరికీ అర్ధమవుతోంది.

 

నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు అన్నీ వ్యవస్ధలను నిర్వీర్యం చేసేశారు. అవినీతి తారాస్ధాయికి చేరుకున్నది. అందుకనే దాదాపు అన్నీ వర్గాలు చంద్రబాబుపై మండిపోతున్నాయి. రేపటి ఎన్నికల్లో గెలుపు టిడిపికి అంత సులభం కాదు. దానికితోడు జాతీయ మీడియా సర్వేలన్నీ జగన్ దే అధికారమని సూచిస్తున్నాయి. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.


విభజన హామీలను రాబట్టటంలో చంద్రబాబు ఫెయిలయ్యారనే చెప్పాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను చంద్రబాబు గాలికొదిలేశారు. చివరకు వ్యక్తిగత ప్రయోజనాలు అందలేదు. రాష్ట్రప్రయోజనాలూ దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించుకోవాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్నంతా జగన్ మీద చూపుతున్నారు. చంద్రబాబు చెప్పినట్లు వైసిపి బురదపామో లేకపోతే త్రాచుపామా అన్నది కొద్ది నెలల్లోనే తేలిపోతుంది లేండి .


మరింత సమాచారం తెలుసుకోండి: