వాన రాకడ..ప్రాణం పోకడ అనేది ఎవ్వరికీ తెలియదు.  మృత్యువు అనేది ఎలాగైనా వస్తుంది..కానీ ఆ చావుకు ముందు కొంత మంది ప్రాణాలు కాపాడి తాను మృత్యువడిలోకి వెళ్లారు ఓ డ్రైవర్.  వివరాల్లోకి వెళితే..సోమవారం ఉదయం తిరువళ్లూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ బస్సులో విధుల్లో ఉన్నాడు. బస్సులో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 

బస్సు నడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో రమేశ్ విలవిల్లాడిపోయాడు. గుండెపోటుతో మరికొన్ని క్షణాల్లో తన ప్రాణాలు తీయబోతోందని తెలిసినా..ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో తాపత్రయపడ్డాడు. తన ప్రాణాలు పోవడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన రమేశ్ క్షణాల్లోనే బస్సును రోడ్డు పక్కకి తీసుకెళ్లి బ్రేక్ వేసి అలానే కుప్పకూలిపోయాడు. ఉన్నట్టుండి రోడ్డు పక్కకు బస్సు మళ్లడంతో ప్రయాణీకులు ఆశ్చర్యానికి గురయ్యారు.

డ్రైవర్ పరిస్థితి చూసి బస్ కండక్టర్ వెంటనే తేరుకుని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అనంతరం చెన్నైలోని కీల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రమేశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. తమ ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ చేసిన సాహసం గురించి తెలిసి ప్రయాణికులు కంటతడి పెట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: