తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలకు భీభత్సమైన పోటీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అయితే అధికారంలోకి రెండోసారి వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కేసిఆర్ ఇప్పటివరకు రెండు నెలలు కావస్తున్నా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు.

Image result for kcr

ఇప్పటికే అనేకసార్లు మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విపక్ష పార్టీలు అనేక కామెంట్లు చేసిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. మరోపక్క పార్టీలో ఉన్న నాయకులు కూడా మంత్రివర్గ విస్తరణ గురించి ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Image result for kcr

ఈ క్రమంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమమైంది. శాఖల పునర్‌ వ్యవస్థీకరణ, పాలన సంస్కరణలపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు శాఖల పునర్‌ వ్యవస్థీకరణ నివేదిక ఇచ్చారు.

Related image

దీనిని పరిశీలించి, సిఎం  మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఈ నెల 15 నుంచి వారాంతం వరకు ఏదైనా ఒకరోజు మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క పార్టీలో ఉన్న నేతలు మంత్రి పదవుల పై ఆశ పెట్టుకున్న వారు తనకి ఎటువంటి పదవులు ఇస్తారు అని కెసిఆర్ నిర్ణయాల గురించి ఆసక్తిగా గమనిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: