"చౌకీదార్ చోర్ హై!" ఇప్పుడు ఏ మాత్రం ఇంగిత ఙ్జానం ఉన్నా కాంగ్రేస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఇక అనకూడదు అంటున్నారు విశ్లేషకులు. కాని ఈ విధమైన ధృవపత్రం బోఫొర్స్ డీల్ లో వాళ్ళ కుటుంబానికి ఇంతవరకు క్లీన్ చిట్ లేదు రాలేదు! బహుశ వస్తుందో? రాదో? తెలియదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం విధానం సరిగానే ఉందని చెప్పింది. కాగ్ గణాంకాలు సరిగానే ఉన్నాయని చెప్పటంతో ఈ కేసు ఇలా ముగుస్తుందనే అనుకోవచ్చు. అయినా అగస్టా కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ కుంభకోణం ఇలా సకల స్కాముల్లో ఈతగొట్టే స్కాముల స్వాముల కు సిగ్గు ఉండదని బిజెపి నేతలు చెపుతున్నారు. 
CAG Report in Rajya sabha కోసం చిత్ర ఫలితం
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి గొప్ప ఊర‌ట ల‌భించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాఫెల్ డీల్‌ పేరుతో రచ్చరచ్చ చేస్తున్న ప్రతిపక్షాలకు ధారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. గతంలోని యూపీఏ ప్రభుత్వం కంటే ఇప్పటి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం చేసిన రాఫెల్ డీలే బాగుందని కాగ్ తేల్చి చెప్పింది. 
CAG Report in Rajya sabha కోసం చిత్ర ఫలితం
రాఫెల్ ఒప్పందంపై బుధవారం రాజ్యసభలో కేంద్రప్రభుత్వం కాగ్ రిపోర్ట్‌ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ సమావేశాలు ముగిసే చివరిరోజు ఈ నివేదికను ప్రభుత్వం రాజ్యసభ ముందుకు తీసు కొచ్చారు. ఈ నివేదిక "కొత్త డీల్‌" ను సమర్థించడం గ‌మ‌నార్హం.
CAG Report in Rajya sabha కోసం చిత్ర ఫలితం
తాజా రాఫేల్ డీల్‌పై "కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జెనరల్ ఆఫ్ ఇండియా"  సంక్షిప్తంగా "కాగ్" స్పందిస్తూ, యూపీఏ హయాంలో చేసుకున్న డీల్‌ తో పోలిస్తే ఈ డీల్ 2.8 శాతం తక్కువని స్పష్టం చేసింది. గతంలో మన్మోహన్ సింగ్  నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం 126 రాఫెల్ విమానాల కొనగోలు ఒప్పందంతో పోలిస్తే, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 36 ఫైటర్-జెట్స్ కోసమే ఒప్పందం చేసుకుంది. అయితే ఈ విమానాలకు చేయాల్సిన కొన్ని కీలక మెరుగులను భారత్‌ లోనే చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల దేశానికి 17.08 శాతం మేర డబ్బు ఆదా అయిందని ఈ నివేదిక చెప్పడం విశేషం. అంతే కాదు సాంకేతిక కొంతైనా మనకు బదిలీ అవుతుందని అన్నారు.  
CAG Report in Rajya sabha కోసం చిత్ర ఫలితం
ఇక గతంలో 126 ఫైటర్-జెట్స్ కోసం చేసిన ఒప్పందంతో పోలిస్తే తొలి 18 విమానాల సరపరా కూడా ఐదు నెలల ముందుగానే జరగనుందని కాగ్ తెలిపింది. యూపీఏ హయాం లోని ఒప్పందం కంటే 9 శాతం తక్కువకు తాము ఫైటర్-జెట్స్‌ను కొనుగోలు చేస్తున్నామని గతంలో కేంద్రం తెలిపింది. అయితే అది 9 శాతం కాదని 2.8 శాతమేనని కాగ్ తన నివేదిక ద్వారా స్పష్టం చేసింది. 

CAG Report on Rafale Deal: मोदी ने मनमोहन सरकार से 2.86 फीसद सस्ते में खरीदा विमान

ఇదిలా ఉండ‌గా, సమావేశాలు ప్రారంభం కాకముందే పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. రాఫెల్ యుద్ధ విమానాల పేపర్-ప్లేన్ల తో నిరసన తెలిపారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రాఫెల్ డీల్‌ పై జేపీసీని నియమించాలన్న డిమాండ్‌ ను ప్రభుత్వం నిర్ద్వంధంగా త్రోసిపుచ్చింది. దీనితో మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.
 

రాఫెల్ డీల్‌ని వివరించే కాగ్ రిపోర్టును రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ నుంచీ యూపీఏ హయాంలో నిర్ణయించిన 126 రాఫెల్ యుద్ధ విమానాలు కాకుండా కేంద్రం కేవలం 36 రాఫెల్ యుద్ధ విమానాల్ని మాత్రమే కొనాలనుకుంటున్న ఒప్పందంపై వివాదం కొనసాగుతోంది. ఈ డీల్ ద్వారా మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడు తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 141 పేజీల కాగ్ రిపోర్టులో 32 పేజీల్లో రాఫెల్ డీల్ వివరాలున్నాయి. 2012 నుంచీ 2017 వరకూ రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ఏం జరిగిందో కాగ్ రిపోర్టులో వివరాలున్నాయి. వైమానిక దళం చేస్తున్న 11 కొనుగోళ్ల ఒప్పందాల వివరాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. వాటిలో 5 యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కాగా, ఆరు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో తీసుకున్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి: