ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది . ఈ క్రమంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పొలిటికల్ ఎపిసోడ్ గత వారం రోజుల నుండి తెలుగు మీడియా ఛానల్ లో కాక పుట్టిస్తోంది.. 2014 ఎన్నికలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం టిడిపి లోకి వెళ్ళిన ఆమంచి తాజాగా వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్  లో ఇందుకోసం వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ని కలిశారు.
Image result for amanchi krishna mohan
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమంచి గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎలాంటి  అభివృద్ధి జరగలేదని కేవలం మీడియా పత్రికలకు మాత్రమే ప్రకటనలు చేస్తూ ఉన్నాయని , కానీ వాస్తవాలు గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడా  అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేశారు , పసుపు కుంకుమ పేరుతో నీచాతి నీచమైన రాజకీయాలకు చంద్రబాబు ఒడిగట్టారని. ఉద్యోగస్తులను అనేక విధాలుగా ఇబ్బందులపాలు చేస్తూ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనాలు తప్ప కనీసం ఉద్యోగస్తులకు కూర్చోడానికి గాని.. త్రాగడానికి నీరు గాని ఎటువంటి సదుపాయాలు లేవని పేర్కొన్నారు. ఇంతటి దారుణం గా సమాజాన్ని ,వ్యవస్థలను నాశనం చేస్తున్న టిడిపి ప్రభుత్వంలో కొనసాగితే రాజకీయంగా నేను ప్రజలను మోసం చేసిన వారిని అవుతానని ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
Image result for amanchi krishna mohan
పసుపు కుంకుమ - డ్వాక్రా మహిళల విషయం లో ఆమంచి క్లియర్ కట్ లెక్కలతో ప్రభుత్వం యొక్క దగా మొత్తం బయటపెట్టినట్టు గా అయ్యింది. ఎన్ని కోట్లు ఇవ్వాలి ఎంత ఇచ్చారు ఎలక్షన్ ముందు కంగారు పడుతూ ఎలా మోసపూరిత ఆరోపణలు చేస్తున్నారు అనేది బయట పెట్టారు ఆయన. " ఆరువేల నాలుగొందల కోట్లు ఈ ప్రభుత్వమే డ్వాక్రా  మహిళల కి బకాయి పడింది " అంటూ బాబు ని చీల్చి చండాడే సారు ఆమంచి. "చంద్రబాబు కంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు . వ్యవస్థ ని నడిపిస్తారు . కేవలం కను సైగ తో వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు " అంటూ ఆమంచి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. " వరస్ట్ కులతత్వం వ్యవహారాల్ని నేను ఖండిస్తున్నా" అంటూ ఆయన టీడీపీ లో కులతత్వం ఎంత ఉంది అనేది కుండ బద్దలు కొట్టారు. " ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటీ చెప్పడం దాన్ని మేము పొగడాలి అని చెప్పడం.
Image result for amanchi krishna mohan
అల్జీమర్స్ వచ్చాయి ఏమో అనిపించేలా సాగుతోంది చంద్రబాబు సరళి , అద్బుతమైన తీర్మానం అంటూ ఒకసారి స్పెషల్ స్టేటస్ గురించి పంపిస్తారు మరో సారి స్పెషల్ ప్యాకేజీ గురించి పంపిస్తారు ఇలా ఆయన చేసే పనులకి అర్ధం పర్ధం ఉండట్లేదు .. మళ్ళీ మోడీ తో ఎందుకు గొడవ అవుతుందో అర్ధం అవదు .. పిచ్చి పట్టినట్టు గా మాట్లాడుతున్నారు .. నీచమైన వ్యక్తిత్వం తో తయారయ్యారు.. అనుభవం ఉన్న లీడర్ గా అధికారం ఇస్తే ఇలా చేసారు రాష్ట్రాన్ని. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు .. రాజు గా రాజ్యం కోసం పోరాడాలి కానీ ఈయన పారిపోయి వచ్చాడు .. హైదరాబాద్ కోసమే కష్టపడి 10 ఏళ్ళు తెచ్చుకున్నాం రాజధాని గా దాన్ని 20 ఏళ్ళు చేసుకోవాలి గానీ రెండేళ్ళ కే పారిపోయి వచ్చాడు. ఆయన వర్గమే తనకి ముఖ్యం అన్నట్టు గా ఫీల్ అవుతున్నారు.
Image result for amanchi krishna mohan
ఒక కులం గుత్తాధిపత్యం గురించి ప్రయత్నం చేస్తోంది. " అంటూ కులం గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ  ఉతికి ఆరేసారు ఆమంచి. ఇదే క్రమంలో వైసీపీ పార్టీ గురించి మాట్లాడుతూ వైయస్ కుటుంబం మాట మీద నిలబడి కుటుంబమని ముఖ్యంగా జగన్ గురించి చాలామంది చాలా విషయాలు తెలియజేశారని, కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని రెండు మూలంగానే వైసిపి పార్టీలోకి చేరడానికి ఇష్టపడుతున్నానని పేర్కొన్నారు. ఆమంచి పార్టీ మారడం ఒక ఎత్తు అయితే ఆయన చెప్పిన సదరు కారణాలు ఆసక్తికరంగా అనిపిస్తూ ఉన్నాయి. పొలిటికల్ గా మీడియా ని చంద్రబాబు ఎంత దారుణంగా వాడుకుంటూ ఉన్నారు అనేది ఏ మాత్రం భయం లేకుండా నిస్సంకోచం గా ఆమంచి చంద్రబాబు గురించి చెప్పడం అదిరిపోయింది అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో హిపోక్రసీ ని విపరీతంగా పాటించే నాయకులకి అవతలి గట్టు మీద ఉన్న ఆమంచి ని చూస్తే ఆశ్చర్యం వెయ్యక మానదు. ఎందుకంటే మీడియా ని ఏకి పారేయడం, భజన మీడియా ని వేలెత్తి చూపించగలగడం ఆమంచి వేసిన డేర్ స్టెప్ అని అంటున్నారు విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: