క‌డ‌ప జిల్లాలోనే రాజకీయ చైత‌న్యం కాస్త ఎక్కువ‌గా ఉండే నియోజ‌క‌వ‌ర్గంగా క‌మాలాపూర్‌ను చెప్పుకోవాలి. 1952లో ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గం మొద‌ట క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉండేది. మొత్తం ఈ నియోజ‌క‌వ‌ర్గానికి  మొత్తం 14సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా ఏడుసార్లు కాంగ్రెస్‌..మూడుసార్లు టీడీపీ ఒక‌సారి వైసీపీ విజ‌యం సాధించాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో బీసీలే అత్య‌ధికులు ఉన్నారు. అయితే ప్ర‌జాప్ర‌తినిధులుగా రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లే ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నికైన వారిలో 13మంది ఆ సామాజిక వ‌ర్గం వారే కావ‌డం గ‌మ‌నించ‌ద‌గిన అంశం.  కాంగ్రెస్‌, టీడీపీల నుంచి మంత్రిస్థాయికి ఎదిగిన రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌నేత మైసూరారెడ్డి ఇక్క‌డి నుంచి మూడుసార్లు గెలిచారు. ఇక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి స‌మీప టీడీపీ అభ్య‌ర్థి పుత్తా న‌ర‌సింహారెడ్డిపై విజ‌యం సాధించారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ నుంచి ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి పోటీకి సిద్ధ‌మ‌వుతుండ‌గా..టీడీపీ నుంచి మాత్రం అభ్య‌ర్థి విషయం తేల‌డం లేదు. 


పుత్తాన‌ర‌సింహారెడ్డి ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న‌తో పాటు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వీర‌శివారెడ్డి కూడా టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌యత్నాలు చేస్తున్నారు. టీడీపీ టికెట్ ద‌క్క‌కుంటే పుత్తా న‌ర‌సింహారెడ్డి పార్టీ నుంచి బ‌య‌ట‌కి వ‌స్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అదే స‌మ‌యంలో వీరాశివారెడ్డి వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇద్ద‌రు క‌ల‌సి ప‌నిచేస్తే త‌ప్ప పార్టీ ఇక్క‌డ గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మ‌ని గుర్తించిన చంద్ర‌బాబు వారిని స‌యోధ్య‌కు తీసుకొచ్చే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న ద‌రిమిలా చంద్ర‌బాబు ఎంత త్వ‌ర‌గా ఈ పంచాయితీని తేల్చితే పార్టీకి అంత దోహ‌దం చేస్తుంద‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నాయి. 

Related image

వాస్త‌వానికి ఇక్క‌డ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అట్ట‌ర్‌ప్లాప్ అన్న విమ‌ర్శ‌లున్నాయి. ఒక్క‌టంటే ఒక్క అభివ‌`ద్ధి కూడా చేయ‌లేద‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శించిన సంద‌ర్భాలున్నాయి. కేవ‌లం జ‌గ‌న్ మేనమామ అన్న పేరుతో కాస్తోకూస్తో నెట్టుకు రావ‌డం త‌ప్ప ఆయ‌న‌కంటూ ఇమేజ్ లేద‌న్న‌ది వారి మాట‌. ఇక వైఎస్సార్ కుటుంబ‌స‌భ్యుల ప్ర‌భావం కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉండునున్న నేప‌థ్యంలో టీడీపీ కూడా ఈసీటుపై బ‌ల‌మైన వ్యూహాల‌ను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే అభ్య‌ర్తి ఎవ‌రో తేల్చ‌కుండా ఎన్ని చ‌ర్య‌లు ఆరంభించినా వ‌`థానే అంటూ తేల్చిచెబుతున్నారు  ఆపార్టీ నేత‌లు. టీడీపీ జెండా ఎగురుతుందో లేక వైసీపీ హ‌వా కొన‌సాగుతుందో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: