చంద్ర బాబు 2019 లో గెలవ లేకపోతే ఆ పార్టీ కి చాలా దెబ్బ అని చెప్పాలి. అయితే ప్రజా వ్యతి రేకత ను తగ్గించడం కోసం బాబు చాలా కష్ట పడుతున్నాడు. అన్ని వర్గాల ప్రజల మీద వరాల జల్లు కురిపిస్తున్నాడు. జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకం అందులోనూ అమరావతిలో జర్మలిస్టుల హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు కేబినెట్  ఓకే చేసేసింది. 2 వేల మంది దాకా రాజధాని పరిధిలో పనిచేసే జర్నలిస్టులకు అపార్ట్ మెంట్ల తరహాలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 30 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం... ఎకరా ధరను రూ.25 లక్షలుగా నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా వెలువడింది.

Image result for chandrababu naidu
ఇక జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమి బదలాయింపే మిగిలి ఉంది. ఇలాంటి నేపథ్యంలో నేటి ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో మరోమారు ఈ అంశాన్ని ముందేసుకున్న చంద్రబాబు... జర్నలిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ప్రకటించిన ఎకరం భూమి ధర రూ.25 లక్షలను ఏకంగా రూ.10 లక్షలకు తగ్గించేసింది.ఇక ఈ రూ.10 లక్షల రేటును కూడా జర్నలిస్టులు ఇప్పటికిప్పుడే కట్టే అవసరం లేదని చెప్పిన బాబు... దానిని విడతలవారీగా చెల్లించుకోవచ్చని కూడా తనదైన ఉదారతను వ్యక్తం చేశారు.
Image result for chandrababu naidu
ఎకరా రూ.10 లక్షల చొప్పున మొత్తం 30 ఎకరాలకు అయ్యే మొత్తం రేటు రూ.3 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.1 కోటి చెల్లిస్తే భూమిని బదలాయిస్తామని మిగిలిన రూ.2 కోట్లను మరో రెండు వాయిదాల్లో చెల్లించేసుకోవచ్చని ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే... బాబు తనదైన పోల్ మేనేజ్ మెంట్ ను బయటకు తీశారని - ఏ ఒక్క వర్గాన్ని వదిలేది లేదన్నట్లుగా సాగుతున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: