తెలుగుదేశం పార్టీలో కులపిచ్చి ముదిరి పాకానపడిందని చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంధర్భాన్ని వివరించారు. తాజా పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు వైసిపి మరియు దాని అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. 
amanchi krishna mohan కోసం చిత్ర ఫలితం

ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి, అలాంటి వ్యక్తి కుమారుడే జగన్మోహనరెడ్డి, ఆయన రాజకీయ వారసుడు కూడా! అందుకే ఆయన్ని కలవటానికి ఈ సంధర్భం లో వచ్చాను. మంచి రోజు చూసుకుని త్వరలోనే వైసీపీలో చేరిపోతాను. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు.

చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే పిచ్చిపట్టినట్లు ఉందని, ఆయన వయసు 70ఏళ్లు పైగానేనని, బహుశ అల్జీమర్స్ (మతిమరపు) వ్యాది వచ్చిందనే అనుమానం ఉందని అంటున్నారు. ఈ రోజు ఒక మాట చెప్పి, తర్వాత యూ-టర్న్ తీసుకొని మరో మాట చెబుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజ్యాంగేతర అంతకంటే అతీత శక్తులు నడిపిస్తున్నాయని అనవచ్చు.
amanchi krishna mohan about kulapicchi కోసం చిత్ర ఫలితం
ఏపి సమాజంతో సంబంధంలేని వ్యక్తులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారని ఆమంచి ద్వజమెత్తారు. తెలుగుదేశంలో కులపిచ్చి ముదిరి తారస్థాయికి చేరిపోయిందని, ఒక కులం గుత్తాధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వ్యవస్థలనన్నింటిని తుద ముట్టిస్తుందని ఆమంచి తీవ్రంగా మండిపడ్డారు. 

వీరి దుష్ట రాజకీయాలను సందివ్వకుండా ప్రచారం చేయటంలో ఆ కులానికే స్వంతమైన పచ్చ మీడియాగా అప్రతిష్ఠ తెచ్చుకొన్న సమాచారవ్యవస్థ కోట్లనోళ్ళతో ప్రతిధ్వనింపజేస్తుంది. అబద్ధాల హోరులో నిజాల సడి మరుగున పడిపోవటం తెలుగుజాతి దురధృష్టం అని పరోక్షంగా చెప్పారు ఆమంచి కృష్ణ మోహన్. 
vijayasai reddy కోసం చిత్ర ఫలితం

ఇక ఇదే విషయాన్ని వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రస్థావిస్తూ స్వంత డబ్బా కొట్టు కోవడంలో చిట్టి నాయుడు అనబడే మంత్రి లోకేష్‌ తండ్రిని మించిపోయాడని ఎద్దేవా చేశారు. తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటుంటే, కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో “అతి పెద్ద” ఉద్యోగం వదులుకొని ప్రజా “షేవ్" కోసం వచ్చానని అంటు న్నాడని తెలిపారు. 
సంబంధిత చిత్రం
నాలుగున్నరేళ్లుగా చెద పురుగుల్లా రాష్ట్ర సంపదని భుజించటం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని అన్నారు. ఇంతకాలం రాష్ట్రాన్ని తినేసి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్ధరు కొత్త దేవుళ్ళుగా అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా, పచ్చ కుల మీడియా మాత్రం తెగ హైరానా పడుతుందని విమర్శించారు. గత రెండు మూడు రోజుల్నుంచి బులెటిన్ల నిండా దీక్ష విజువల్సేనని, మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి, తమ జాతి పిత నారా చంద్రబాబు నాయుడు ఋణం ఆ మీడియా సంస్థలు తీర్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైమ్-టైం న్యూస్లో ఈయన గారి నల్ల చొక్కాల పబ్లిసిటీ స్టంట్ చూడలేక ఏపిజనాలు చానళ్లు మార్చుకుంటున్నారని అన్నారు.

kamma kulapicchi కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: