ఏపీలో ఓ సామాజిక వర్గం గుత్తాధిపత్యం నడుస్తోందా.. ఆ కులం మాత్రమే పది కాలాల పాటు అధికారంలో ఉండాలని కొంత మంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు బలంగా కోరుకుంటున్నాయా..మొత్తం సమాజానికి దక్కాల్సిన ఫలాలు, ఫలితాలు కొందరే బోజ్యంగా చేసుకుంటున్నారా. ఇదే నిజమైతే  మాత్రం ఏపీ భయంకరమైన పరిస్తితుల్లోకి వెళ్లిపోయిందన్నమాటే.


ఆమంచి ఆవేదన : 


ఇప్పటివరకూ పార్టీని మారిన వారు ఎవరూ చెప్పని కఠోరమైన సత్యాలను చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణప్రసాద్ చెప్పడం నిజంగా టీడీపీకి కాదు, ప్రజలకు షాక్ లాంటిది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ మీడియా మాయాజాలంలో తెలియడం లేదని ఆమంచి కలత చెందిన తీరు నిజంగా ప్రతీ పౌరున్ని ఆలోచింపచెసేవే.  పత్రికలు చదివి కాకుండా నిజాలను నిర్ధారణ చేసుకోండని ఓ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజంగా కలవరపాటుకు గురి చేసేవే. ఏపీలో కుల రాజ్యం నడుస్తోందని ఆమంచి అన్నదే కనుక నిజమైతే ఇంక ఈ సమాజానికి అర్ధమే లేదనుకోవాలి. ప్రభుత్వం కొందరిదిగా  నడుపుతున్న తీరు వల్ల ప్రజాస్వామ్యం, స్వాతంత్రం అర్ధాలు మారిపోతాయని ఆమంచి ఆవేదన నిజంగా అంతా అర్ధం చేసుకోవాల్సిందే. 


ఒక కులం మీడియా కను సన్నల్లో :


ఏపీలో పాలన బ్రహ్మాండం, అంతా బాగుంది ఈ మాటలు గత అయిదేళ్ళుగా వినిపిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు . అలా ప్రజలను మీడియా మాయాజాలంలో పెట్టి జరుగుతున్నది వేరుగా ఉండడమే ఆమంచి మాటల్లో బయటపడింది. తాను పార్టీ మారుతున్నది కేవలం తన నియోజకవర్గం సమస్యల కోసం కాదు, ఏపీ సర్కార్ కి కుల పిచ్చి బాగా పెరిగిపోయిందని ఆమంచి చేసిన ఘాటు వ్యాఖలు చూస్తే కనుక కొత్త రాష్ట్రం ప్రమాదంలో పడిందని అర్ధమవుతోంది. ఈ నిజాలను చెప్పకపోతే తాము రాజకీయాల్లో ఉండి ప్రయోజనం ఏంటని ఆమంచి ప్రశించిన తీరు కూడా చర్చనీయాంశమే.


ఈ దేశంలో అందరికీ వాటా ఉంది. ఈ దేశంలోని అభివ్రుధ్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములే, కేవలం కొన్ని కులాలే బాగు పడడానికి ప్రజాస్వామ్యం  లేదు. అలా అయితే దానికి అర్ధం కూడా లేదు. స్వాతంత్రం తెచ్చుకున్నది ఒకటి రెండు కులాలు బాగు పడడానికి కానే కాదు.  కానీ ప్రభుత్వ నేతలు మాత్రం మొత్తం అన్ని తమ దగ్గర పెట్టుకుని జనానికి పప్పు బెల్లాలు వేసి మభ్యపెడుతున్న తీరుని ఆమంచి ఆవేదన్లో స్పష్టంగా కనిపించింది. ఇదే నిజమైతే  మాత్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఏపీ ఉందని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: