ఎన్నికలను ఎదుర్కోవటం ఈ సారి టీడీపీ కి అంత సులభం కాదని చెప్పాలి. ఇప్పటికే సర్కార్ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది . దీనితో చంద్ర బాబు ఎన్నికల ముందు అందరి మీద వరాల జల్లు కురిపిస్తున్నాడు. ఇప్పటికే నిధుల లేమితో సతమతం అవుతున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ఎన్నికల్లో గంపగుత్తగా రైతుల ఓట్లను దక్కించుకునేందుకే ఈ పథకాన్ని ప్రకటించినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఈ పథకంలో బాబు మార్కు మతలబులు చాలానే ఉన్నాయని చెప్పాలి.

Image result for chandrababu naidu

ఎందుకంటే... తాము రైతులకు అందించే రూ.10లే సొమ్ములో కేంద్రం ఇచ్చే రూ.6వేలను జమ చేసేశారు. అంటే కేంద్రం ఇచ్చే రూ.6 వేలను మినహాయిస్తే... రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.4 వేలు మాత్రమే. అంటే ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగానే గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు... అందులో 60 శాతం వాటా కేంద్రానిదేనని ఒప్పుకోవడం గమనార్హం. ఇప్పటికే బాబు ప్రకటించిన పలు పథకాలకు కేంద్ర పథకాల ద్వారా అందుతున్న నిధులే మూలమన్న వాదన లేకపోలేదు. 

Image result for chandrababu naidu

అయినా ఎకరాకు ఇంత మొత్తం అని ప్రకటించాల్సిన ప్రభుత్వం... ఐదు ఎకరాలలోపు రైతులందరికీ రూ.10 వేలంటూ ప్రకటించడం ఏమిటో కూడా అర్ధం కాని పరిస్థితి. తక్కువ పొలం ఉన్న రైతులకు ఒకే మొత్తం ఎక్కువ పొలం ఉన్న రైతులకు కూడా ఒకే మొత్తమన్న మాట. అయినా ఇలా రైతుల్లోనే వ్యత్యాసాలు సృష్టించేలా ఈ తరహా పథకాలు చంద్రబాబు జమానాలో మాత్రమే సాధ్యమేనేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: