ఏపీ సీఎం చంద్రబాబుకు వయస్సు 70 సంవత్సరాలకు చేరువవుతోంది. కానీ ఫిట్ నెస్ లో మాత్రం చంద్రబాబు తర్వాతే ఏ నాయకుడైనా.. ఆయనకు బాడీపై అంత కంట్రోల్ ఉంటుంది. ఆయన మితాహారం తీసుకుంటారు. రోజూ యోగా చేస్తారు. ఫిట్ నెస్ పై శ్రద్ధ వహిస్తారు.



శరీరం వరకూ ఓకే.. కానీ ఆయన మెదడుగా బాగానే పనిచేస్తోందా.. అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందంటున్నారాయన.



ఆయన ఈ రోజు ఒక మాట చెబుతారు.. రేపు అదే మాటను తప్పని.. మళ్లీ కొత్త విషయం చెబుతారు. ఆయన ఏది చెబితే అదే రైట్ అంటారు. బహుశా వయస్సుతో పాటు ఆయన అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టుంది.. మేం ఆయన తీరుతో చచ్చిపోతున్నాం.. అంటూ ఆమంచి కామెంట్ చేశారు.



అయితే చంద్రబాబు అల్జీమర్స్ వంటి వ్యాధి ఉండే అవకాశమే కనిపించడంలేదు. ఎందుకంటే ఆయన నిత్యం బిజీగా ఉంటారు. వివిధ వేదికలపై గంటలకొద్దీ మాట్లాడతారు. ఎక్కడా పెద్దగా తప్పుదొర్లడం చాలా అరుదు. మరి అల్జీమర్స్ ఉంటే ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి. కాకపోతే ఆయన రాజకీయంగా తీసుకునే యూటర్నులు ప్రత్యర్థులు ఆరోపణలు చేసేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: