చంద్రబాబు ఇటీవల చాలా దీక్షలు చేస్తున్నారు. ధర్మ పోరాటం పేరుతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఢిల్లీలోనూ జోరుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ పోరాటాలకు ఆంధ్రుల ఆత్మగౌరవం అని నినాదాలు ఇస్తున్నారు. మరి చంద్రబాబు చెబుతున్న ఈ ఆత్మగౌరవ నినాదం ఎంతవరకూ సమంజసం ఓ సారి చూద్దాం.  ఆత్మగౌరవం నినాదాన్ని గతంలో ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత వంటి నేతలు మొదట నినదించారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాన నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో జనంలోకి వచ్చారు. 

Image result for sr ntr

కేంద్రం మెడలు వంచి మళ్లీ అధికారం సాధించారు. అదీ ఆత్మగౌరవ నినాదం పవర్. ఈ క్రమంలో ఆయన ఎక్కడా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగలేదు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్  పెట్టి చక్రం తిప్పిన సమయంలోనూ ఎక్కువగా ఢిల్లీ పెద్దల దగ్గరకు వెళ్లలేదు. చాలామంది జాతీయ నేతలు కూడా అప్పట్లో హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలిసే వారు. అదీ ఆత్మగౌరవ నినాదం సత్తా. ఇక కరుణానిధి, జయలలితల ఆత్మగౌరవం సత్తా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ అయినా అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలిశారేమో కానీ.. వీరిద్దరూ చెన్నై నుంచే కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి ముచ్చెమటలు పట్టించడంలో సిద్ధహస్తులు. అదీ వారి ఆత్మగౌరవ నినాదం సత్తా.. 


మరి ఇప్పుడు ఏం జురుగుతోంది. చంద్రబాబు ఆత్మ గౌరవ నినాదంతో ఏం చేస్తున్నారు.  ఢిల్లీకి వెళ్లి ప్రతి జాతీయ నేతనూ కలుస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వమని అర్థిస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తుందంటూ ఇన్నాళ్లూ తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. మరి నిజంగానే మోడీ సర్కారు నిజంగానే ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మోసం చేసిందా.. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫరవాలేదు.. ప్రత్యేక ప్యాకేజీ చాలని ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుంది ఇదే చంద్రబాబునాయుడు కాదా.. అప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం ఏ యుమునానదిలో కలిసింది..? 

Image result for karuna nidhi

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగానే మురిసిపోయి.. కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీ ప్రత్యేక  తీర్మానం చేసినప్పుడు ఆత్మగౌరవం ఏ కృష్ణానదిలో కలిసిందో.. ప్యాకేజీ ప్రకటించగానే ప్రెస్ మీట్లోనే ఫోన్లో మాట్లాడుతూ.. థ్యాంక్యూసర్.. యు డిడ్ వెరీ వెల్ అంటూ కేంద్ర పెద్దలకు చెప్పిన థ్యాంక్స్ ఇంకా జనం చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి కదా. ప్రత్యేక హోదా పేరు ఎత్తితే జైళ్లో పెడతామని బెదిరించింది ఇప్పటి హోదా ఉద్యమకారుడు చంద్రబాబే కదా.. ఇంతలోనే ఇన్ని టర్నులు ఎప్పుడు తీసుకున్నారు.. ఎందుకు తీసుకున్నారు.. ప్రజలకు ఏమైనా చెప్పగలరా.. ఇంతకీ చంద్రబాబు చేస్తున్న తెలుగు ఆత్మగౌరవ పోరాటమేనా..? 

Image result for chandrababu naidu

ఆంధ్రా శక్తిని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టిందెవరు.. గతంలో ప్రత్యేక నినాదం చేసిన వారి గొంతలను మార్చిందెవరు.. గతంలో ప్రత్యేక ఆంధ్ర పోరాటం చేసిన వ్యక్తి చలసాని శ్రీనివాస్.. మరి ఆయన గొంతును ఎలా నొక్కారు.. ఆయన్ను సమైక్యాంధ్రకు ఎందుకు మర్చారు. చంద్రబాబు దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా.. ? 

Image result for jayalalitha

రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు ఆత్మగౌరవాన్ని పట్టించుకున్నారా.. మేం విడిపోతాం మొర్రో అని తెలంగాణవాళ్లు ఉద్యమాలు చేస్తుంటే.. ఆంధ్రావాళ్లను బండబూతులు తిడుతుంటే.. అబ్బే కాదు.. మనం సమైక్యంగా ఉందామని బతిమాలడం ఆత్మగౌరవం అవుతుందా.. విభజన సమయంలో మాకు ఇది కావాలని అని డిమాండ్ చేసే ధైర్యం లేకుండా సమైక్యరాగం ఆలపించడం ఆత్మగౌరవం అవుతుందా.. అప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ నినాదం ఏ మూసీ నదిలో కలిసింది..? 


గతంలో నాదెండ్ల భాస్కర్ రావు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు  పోరాడి సీఎం పీఠం దక్కించుకున్నా.. ఎన్టీఆర్ శాంతించలేదు. అవసరం లేకపోయినా నైతికత కోసం మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. బ్రహ్మాండమైన మెజారిటీ మళ్లీ సీఎం కుర్చీ ఎక్కారు. అదీ ఆత్మగౌరవం.
మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు.. ?
Image result for నాదెండ్ల భాస్కర్ రావు
అధికారానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉన్నా.. పక్క పార్టీవారికి పదవుల ఎర వేసి తన పార్టీలోకి లాక్కున్నారు. ఇదేనా ఆత్మగౌరవం.. తన పార్టీలోకి వచ్చే వారు సొంత పార్టీకి రాజీనామాకు చేయకుండానే వస్తున్నారు. ఇంకా టెక్నికల్ గా పక్క పార్టీలోనే ఉంటున్నారు.. వారిపై చర్య తీసుకోమని స్పీకర్ కు విజ్ఞప్తులు చేసినా.. అవి పట్టించుకున్న దాఖలాలు లేవు.. మరి ఇదేనా  తెలుగువారి ఆత్మగౌరవం..మాటపై నిలబడటం ఆత్మగౌరవం ఆత్మగౌరమమా..

Image result for chandrababu naidu


పదే పదే యూటర్న్ తీసుకోవడం ఆత్మగౌరవమా..?
ఇలా రాష్ట్రవిభజన దగ్గర నుంచి.. విభజన తర్వాత విభజన హామీలు సాధించుకునే విషయంలోనూ.. చంద్రబాబు ఏనాడూ ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదు. ఆత్మగౌరవ నినాదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎన్టీఆర్‌ నే వెన్నుపోటు పొడిచి ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేసిన చంద్రబాబు నోట ఇప్పుడు ఢిల్లీలో ఆత్మగౌరవ నినాదం వినిపించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. కాదంటారా..? 


మరింత సమాచారం తెలుసుకోండి: