నాలుగురోజులు స్నేహం చేస్తే వారు వీర‌వుతారు... అన్న ఓ సామెత ఎప్ప‌టి నుంచో ఉంది.. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చూస్తే అది నిజ‌మే అనిపిస్తోంది. టికెట్ల కేటాయింపు విష‌యంలో చంద్ర‌బాబును ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫాలో అవుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. టికెట్ల కేటాయింపు విష‌యంలో చంద్ర‌బాబు ప‌ద్ధ‌తి చాలా విచిత్రంగా ఉంటుంది.  పార్టీకి ప‌ట్టున్నా..లేక‌పోయినా.. ఆ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను అర్ధ‌రాత్రియే ప్ర‌క‌టిస్తూ వ‌స్తుంటారు. అంతేకాక పొలిట్‌బ్యూరోలో పెట్టి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్లుగా చెబుతుంటారు. వాస్త‌వానికి అక్క‌డ అభ్య‌ర్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఆ పార్టీలోనే కాదు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్న వారంద‌రికీ తెలుసు. 


వ‌డ్డించేవాడు మ‌న‌వాడ‌యిన‌ప్పుడు మ‌న‌కు ద‌క్కాల్సింది మ‌న‌కే ద‌క్కుతుంద‌న్న  సామెత ఎలాగూ ఉంది. ముందే సిద్ధం చేసి పెట్టిన అభ్య‌ర్థుల పేర్ల‌ను పొలిట్‌బ్యూరో స‌మావేశంలో చ‌దివి వినిపించి.,చ‌చ్చిన‌ట్లు మిగ‌తావాళ్లు స‌రే అనేట్లు చేయ‌డ‌మే  చంద్ర‌బాబు స్పెష‌ల్‌. చివ‌రికి త‌న కుప్పం సీటుకు కూడా ఇలానే తాను పోటీకి ఆస‌క్తి ఉన్నాన‌ని, త‌న పేరును ప‌రిశీలించ‌మ‌ని పొలిట్‌బ్యూరో ముందు పెడుతుంటారు..దీనికి న‌వ్వాలో ఏడ్వాలో తెలియ‌క మిగ‌తా స‌భ్యులు స‌త‌కం చేయాల‌న్న మాట‌. ఇక జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌సీని అనుస‌రిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.


అభ్య‌ర్థుల ఖ‌రారు అన్నది పార్టీ పొలిట్‌బ్యూరో చూసుకుంటుంద‌ని బ‌హిరంగ‌స‌భల్లో చెబుతూ వ‌స్తున్నారు. తాజాగా తాను పోటీ చేసే స్థానాన్ని కూడా పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌ను ఏ రాజ‌కీయ క‌మిటీ ప్ర‌క‌టించింద‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై వెల్లువెత్తుతున్నాయి.  అసలు ధరఖాస్తులే తీసుకోవటం పూర్తి కాకుండానే అభ్యర్ధుల పేర్లు ఎలా పవన్ ప్రకటించారు. వాళ్ళ పేర్లను ప్రకటించిన పవన్ తాను సీటు కోసం దరఖాస్తు చేసుకోవటం ఏమిటి?? ఇది ఎవరిని మభ్యపెట్టడానికి అంటూ మ‌నోడిపై చాలా ప్ర‌శ్న‌లు కురుస్తున్నాయి...ప‌వ‌న్ గారు మ‌రి స‌మాధానాలు చెప్ప‌డానికి మీరు రెడీనా..?!


మరింత సమాచారం తెలుసుకోండి: