చంద్రబాబునాయుడు వ్యవహారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అవసరమైనపుడే మనుషులను చేరదీస్తారు. అవసరం తీరిపోగానే దూరంగా నెట్టేస్తారన్న విషయం చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా అందుకు ఉదాహరణగా మరో ఉదంతం జరిగింది. అదే కొర్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకాలు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు పెట్టుకుని ఎవ్వరూ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకం చేపట్టరు చంద్రబాబు తప్ప. తాజాగా 22 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.

 

నిజానికి ఇందులో చాలా కార్పొరేషన్లు సంవత్సరాల తరబడి ఖాళీగనే ఉండిపోయాయి. ఎంతోమంది తమకు పదవులు ఇవ్వాలని కాళ్ళా వేళ్ళా పడినా  చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. కార్పొరేషన్ల భర్తీని మొదట్లోనే చేసేసుంటే ఈ పాటకి కనీసం వందల మంది నేతలకు అవకాశాలు వచ్చి ఉండేవి. ఒక్కో బోర్డు కాలపరిమితి రెండేళ్ళనుకున్నా కనీసం మూడు బ్యాచుల్లో చాలామంది నేతలను సంతృప్తి పరిచుండొచ్చు. కానీ ఇక్కడున్నది చంద్రబాబు కదా ? అందుకే అందరినీ తన చుట్టూ తిప్పించుకున్నారు కానీ అడిగిన వాళ్ళల్లో ఎవరికీ ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు.

 

మరి ఇపుడు మాత్రం ఏమవసరం వచ్చిందిన ఏకంగా 22 కార్పొరేషన్లు వేశారు ? ఎందుకంటే, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కార్పొరేషన్ల భర్తీ విషయంలో చంద్రబాబు వైఖరితో చాలామంది నేతలు మండిపోతున్నారు. జనాల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో  టిడిపి గెలుపుపై చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అటు జనాల్లోను వ్యతిరేకత పెరిగిపోయి ఇటు నేతల్లోనే వ్యతిరేకత వచ్చేస్తే మొత్తానికి పుట్టి ముణుగుతుంది.

 

అందుకనే చివరి నిముషంలో అయినా కార్పొరేషన్లు భర్తీ చేశారు. ఇఫుడు భర్తీ చేసిన కార్పొరేషన్ల ఛైర్మన్లను కూడా సంతృప్తి పరచటానికి కాకుండా తన స్వార్ధం కోసమే చేశారు. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందన్న ఆందోళనతోనే హడావుడిగా భర్తీ చేశారు. ఇపుడు భర్తీ చేసిన కార్పొరేషన్లలో  వైద్య మైళిక సదుపాయాలు, మహిళా ఆర్ధిక సహాకర కార్పొరేషన్, ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ (కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలు), ఏలూరు అర్బన్ డెవలప్మెంట్, ఏపి టెక్నాలజీ సర్వీసెస్, గిరిజన సహకార కార్పొరేషన్ లాంటి పెద్ద కార్పొరేషన్లున్నాయి.

 

మొదటినుండి కూడా చంద్రబాబు తత్వం ఏమిటంటే సాధ్యమైనంతలో ఎవరికీ ఎటువంటి పదవులు ఇవ్వకూడదు. అందరికీ పదవులు ఇస్తానని హామీలిస్తూనే అందరితోను పనులు చేయించుకోవటం అలవాటు. పైగా నేతలందరినీ తన చుట్టూ తిప్పించుకోవటమంటే చంద్రబాబుకు మహా సరదా. ఎవరితో అయినా పని పడుతుందని అనుకుంటేనే వారికి పదవులు ఇవ్వటం చంద్రబాబు అలవాటు. అందుకే అప్పుడప్పుడు ఒకటి అరా పదవులు మాత్రం ఇస్తుంటారు. దాంతో మిగితివాళ్ళకు ఆశలు పుట్టి చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత తన చుట్టూ ఎవరు తిరగుతారని అనుకున్నారో లేకపోతే ఎవరూ తిరగరని అనుకున్నరో కానీ అవసరార్ధమే 22 కార్పొరేషన్లు హడావుడిగా నియమించారు. మరి ఛైర్మన్లు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: