దేశంలోనే అతిపెద్ద ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది.  ఆకాశ్‌ అంబానీ, వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహ తేదీ ఖరారైంది. ఆహ్వాన పత్రికల నుంచి మొదలు వివాహ వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి పందిరి, సంగీత్‌, మెహందీ, వివాహ వేడుకలు ప్రతి చిన్న విషయంలో అంబాని ఫ్యామిలీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయాల్సిందే.  రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ- నీతాల గారాల పట్టి ఈశా వివాహ వేడుకలను జనం మరువక ముందే మరో వేడుకకు అంబానీ కుటుంబం సిద్దమైంది.

ఆకాశ్‌ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చి 9న జియో వరల్డ్‌ సెంటర్‌ వేదిక జరగనున్న విషయం తెలిసిందే.  ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి దేశంలోని ప్రముఖులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరౌతున్నారు. ఇక తొలి వివాహ ఆహ్వాన పత్రికకు సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఆకాశ్ పెళ్లి కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని చూస్తే వావ్ అనాల్సిందే. 
Related image
ఒక్కో శుభలేఖకు ఏకంగా 1.5 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం.  బోర్డ్ గేమ్ సైజులో బాక్స్, యానిమేటెడ్ రొటేటింగ్ డిస్క్, తాకగానే వెలిగే లైట్లు, శ్రీకృష్ణ, రాధల చిత్రం, వినాయకుడి ఎంబోజింగ్ ప్రతిమ ..ఇలా వెడ్డింగ్ కార్డు ప్రత్యేకత గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇలాంటి వెడ్డింగ్ కార్డు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ కు గురయ్యేలా ఈ కార్డును చాలా గ్రాండ్‌‌గా డిజైన్‌ చేశారు. 
Related image
ఇందులో ముకేశ్‌-నీతా అంబానీలు అతిథులను ఆహ్వానిస్తున్నట్లుగా స్వహస్త్రాలతో రాసిన లేఖ తొలిగా దర్శనమిస్తుంది. అనంతరం వివాహానికి సంబంధించిన వివరాలు, అతిథులకు ఇచ్చే బహుమతులు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటాయి. మొత్తానికి అంబాని వారి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: