ఎన్నికలు దగ్గర పడుతుంటే అధికార పార్టీ నుంచి వలసలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ జగన్ పార్టీ ఖండువా కప్పుకున్నారు. అయితే ఇప్పట్లో ఈ వలసలు ఆగేటట్లు కనిపించడం లేదు. మరో ఇద్దరు ఎంపీలు జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వినికిడి.  చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చే ఆ ఎంపీ, ఈ మధ్యనే వైఎస్సార్సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరిపారట. అలా మొత్తంగా ముగ్గురు ఎంపీలపై వైఎస్సార్సీపీకి ఓ క్లారిటీ వచ్చేసింది. ముగ్గురు కాకపోయినా, ఇద్దరు పక్కా.. అనే ఆలోచనతో, 'ఇద్దరు పార్టీ మారుతున్నారు' అని వైసీపీ ముఖ్యనేత ఒకరు ఈరోజు ఉదయం ప్రకటించేశారు. అదీ అసలు సంగతి.


ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!

ఇదిలావుంటే, దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ముగ్గురు ఎంపీలూ తమవెంట ఇద్దరేసి ఎమ్మెల్యేలను, వీలైతే ఇంకాస్త ఎక్కువమంది ఎమ్మెల్యేలను ఇతర ముఖ్యనేతల్ని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకెళ్ళేందుకు ముందస్తుగానే ప్లాన్‌ రెడీ చేసుకున్న దరిమిలా.. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఓ రేంజ్‌లో కన్పించబోతున్నాయన్నది నిర్వివాదాంశం.


ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!

ఇక, షరామామూలుగానే చంద్రబాబు గగ్గోలు పెట్టడం మొదలెట్టేశారు పార్టీ మారుతున్న నేతల మీద. 'పదవులు అనుభవించి వెళ్ళిపోయారు..' అంటూ చంద్రబాబు తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారు. జనానికి అన్నీ కన్పిస్తున్నాయి.. పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా తెలంగాణలో చంద్రబాబు అభివర్ణించిన వైనం.. అదే రాజకీయ వ్యభిచారాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఆయనగారు ప్రోత్సహించిన వైనం.. ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతున్న నేతలపై వికారపు వ్యాఖ్యలతో చంద్రబాబు విరుచుకుపడటం.. అన్నీ అందరికీ అర్థమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: