తాజాగా విడుదల అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచార చిత్రం (ట్రైలర్) తెలుగుదేశం పార్టీకి మరో శిరోవేదనగా మాత్రనుందా! ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఓట్లు బిక్ష కోరే స్థితిలోనే ఉంది తెలుగు దేశం పార్టీ. 

 

అందుకే తెలుగుదేశం పార్టీ నేత, శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడి వియ్యంకుడు నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ భారీ ఎత్తున ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో ఆయన జీవన చిత్రం (బయోపిక్) తొలి బాగం తీసుకు రాగా అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ పాత్రను స్వయంగా నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోషించినా ఆ సినిమా ధారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. 

 mahanati images కోసం చిత్ర ఫలితం

ఇక్కడ ఒక విషయం పరిశీలించాలి – జీవన చిత్రాల్లో తొలి చిత్రం మహానటి-సావిత్రి కీర్తితో పాటు కలక్షన్ల వర్షం కురిసింది. అలాగే ఉండ బోతుంది అనుకుటున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు విపరీత ఔన్నత్యం అద్దుతూ ఆయన్నొక దైవసమానంగా మహోన్నతుడుగా చిత్రీకరించటం వంశం గౌరవం అంటూ స్థాయిని మరచి మనిషిని మనీషిగా కాకుండా మహోన్నతుడుగా చిత్రీకరించే తపనలో పాత్ర ఆత్మను చంపేసి మెరమెప్పులకోసం ముందుకు నడవటం తో సినిమా చచ్చిపోయింది. 

 yatra movie images hd కోసం చిత్ర ఫలితం

“యాత్ర” సినిమా ఒక నిజంగా జీవన చిత్రం. కథానాయకుడు ప్రధాన పాత్రను తనలో ఆవాహన చేసు కున్నాడు. దాంతో సినిమాకు ఆత్మ అనుసంధానమైంది. బయోపిక్ లకు ‘యాత్ర ఒక ఆదర్శమైన కొలత’ గా చెప్పొచ్చు.  

 

ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు తరువాత భాగంగా ఎన్టీఆర్ మహా నాయకుడు రాబోతోంది. అందులో ఖచ్చితంగా ఎన్నికల ప్రయోజనాలు ఆశిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాజకీయ భాజా ఉంటుందనేది స్పష్టం అవుతూనే ఉంది. ఇక్కడ చంద్రబాబే ఎన్టీఆర్ ను రాజకీయంగా నిలబెట్టినట్టుగా, చంద్రబాబే ఎన్టీఆర్ ను గెలిపించినట్టుగా, చంద్రబాబే ఎన్టీఆర్ ను మహానాయకుడుగా తీర్చిదిద్దినట్లు ఆ సినిమాలో చూపక తప్పదు ఇందులో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.

lakshmi's ntr vs ntr mahanayakudu కోసం చిత్ర ఫలితం 

ఇప్పటికే ఎన్టీఆర్ తో రాజకీయంగా బలైపోయిన నాదేళ్ళ భాస్కరరావు ప్రమేయంతో ఎన్టీఆర్, చంద్రబాబు, నందమూరి కుటుంబంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వంశం, బ్రీడ్, సీడ్ అంటూ వీళ్ళ వంశం నుండి వచ్చిన కథానాయకులు తొడగొట్టిన తీరుతో నందమూరి కథాయకులంటే ఏహ్యభావం సర్వత్రా నెలకొంది.

lakshmi's ntr vs ntr mahanayakudu కోసం చిత్ర ఫలితం 

అందుకే సినిమాలో ఏమాత్రం సమతౌల్యం (బాలన్స్) తప్పినా రాజకీయంగా ఆర్ధికంగా వారికి పెను విషాధం తప్పదు.  ఇలాంటి సమయంలో ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఎన్ టీఆర్ జీవన చిత్రం  సినిమా ట్రైలర్ రానే వచ్చింది. ఇందులో సూటిగా చంద్రబాబు మీద, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైనే జన హృదయాల్లో బలమైన ముద్ర వేయగల పంచ్ లు పడిపోయేది ఖచ్చితంగా నిజం. ఎన్టీఆర్ మీద చెప్పులు పడ్డ యధార్ధ వైనాన్ని కూడా చూపించారు.

 

అయితే ఇవన్నీ ప్రజలకు కొత్త విషయాలు కాకపోయినా ఇది వరకూ అనేక మంది తమ రచనల్లో ప్రస్తావించినా సినిమా బలమైన మాధ్యమం కాబట్టి ఒక ప్రక్క యదార్ధ చిత్రం వస్తుంటే – బాజా బజంత్రీలతో డప్పు కొట్టుకు నే కల్పిత వ్యక్తి ప్రయోజిత సన్నివేశాలతో నిండిన అబద్ధాల చిత్రాన్ని ఎవరు ఎంతలా ఆదరిస్తారు?

lakshmi's ntr vs ntr mahanayakudu కోసం చిత్ర ఫలితం 

సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఏదైనా సరే, సినిమా యధార్ధంగా చిత్రీకరిస్తే దాని ప్రభావం మంచిగా ఉంటుంది. అందుకే ఎన్నికల ముందు ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఎన్టీఆర్ బయోపిక్ ను తీసుకొచ్చారు. ఇప్పుడు అందుకు కౌంటర్ సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆసక్తిని రేపుతోంది. ఇందులో వాస్తవాలను వాస్తవాలుగా చూపిన దాఖలాలే ట్రైలర్ లో  కనిపిస్తున్నాయి.

 à°¸à°‚బంధిత చిత్రం

మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నికల ముందు వస్తే చంద్రబాబు ఇమేజ్ ను మరింతగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది? కోర్టుకు వెళ్లి ఈ సినిమా విడుదలను ఎన్నికల వరకు ఆపుతుందా? అయితే న్యాయస్థానం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో? కాలమే నిర్ణయిస్తుంది. ఏమైనా తెలుగుదేశం పార్టీకి ఇది తీవ్రమైన శిరోవేదనే.  

 lakshmi's ntr vs ntr mahanayakudu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: