భారత సరిహద్దులు రక్తసిక్తం అయ్యాయి. గత రెండు దశాబ్ధాల కాలంలో ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరగలేదు. పాకిస్తాన్ నేతృత్వంలో జైష్-ఏ- మహమ్మద్ అంతర్జాతీయ నిషేదిత ఉగ్రవాద సంస్థ చేసిన ఘాతుకమిది. 

terrorist attack on pulwama కోసం చిత్ర ఫలితం


మన భద్రతా దళాల త్యాగాలు వృథా కావు — ప్రధాని మోదీ 


ఉగ్రవాదులకు తగిన రీతిలో సమాధానం చెప్తాం!  దేశ ప్రజలకు నాది హామీ --- హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


గుణపాఠం తప్పదు - అరుణ్‌ జైట్లీ


ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం - వీకే


నిన్నటి ఉగ్రవాదుల కిరాతక చర్యపై వారి స్పందన ఇది!


2016 ఉడీ సెక్టర్ దాడి కి ప్రతీకారంగా "సర్జికల్‌ స్ట్రైక్స్‌" చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ఈసారి దేబ్బకుదెబ్బ అంతకు మించి మరింత దెబ్బకుదెబ్బ తీసే ప్రయత్నాల్లో ఉందా? పీవోకేలో మళ్లీ సర్జికల్‌ దాడులు? విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి.  పాకిస్థాన్‌ సైన్యానికి, ఐఎస్‌ఐకి, ఉగ్రవాదులకు ఒక బలమైన సందేశం పంపేందు కు నరేంద్ర మోదీ ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటుందని, మరోసారి పెద్ద ఎత్తున "పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌" లో సర్జికల్‌ దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
terrorist attack on pulwama  కోసం చిత్ర ఫలితం 
పాక్‌కు బుద్ధి చెప్పే అవకాశాన్ని నరేంద్ర మోదీ ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోరని, ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసే దాడి విభిన్నమైన రీతిలో ఉంటుందని పేర్కొన్నాయి. పుల్వామాలో గురువారం జవాన్లపై దాడి జరిగిన సమయానికి, ప్రధాని ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్నారు. దాడి గురించి తెలియగానే ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మాట్లాడారు. అనంతరం దోవల్‌ భద్రతాదళాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సలహాదారు విజయ్‌ కుమార్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కి చెందిన ఒక ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో 12 మంది ఫోరెన్సిక్‌ నిపుణులతో కూడిన బృందం అక్కడికి చేరుకుని దీనిపై దర్యాప్తు చేయనుంది. వారితోపాటు ఉగ్రవాద వ్యతిరేక కమాండో దళం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ) కూడా కశ్మీర్‌కు వెళ్లి దర్యాప్తులో సహకరిస్తారని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. 


కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ఘటనపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్‌ను కలిసి చర్చించారు. ఐబీ డైరెక్టర్‌ తో, అజిత్‌ దోవల్‌తో కూడా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. దాడి, తరువాత చర్యలు ప్రతీకార చర్యలపై చర్చించేందుకు భద్రతపై కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) శుక్రవారం ఉదయం 9.15 గంటలకు భేటీ కానుంది.
terrorist attack on pulwama  కోసం చిత్ర ఫలితం
భారత  అంతర్జాతీయ సద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. భారత ఆర్మీ సైనికులను టార్గెట్ గా పుల్వామా జిల్లా  అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 44 మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.  జైషే మొహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో ఉన్న కారు సిఆర్పీఎఫ్ కాన్వాయ్ లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించింది.


సిఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో కాన్వాయ్ గా వెళ్తుండగా, పేలుడు పదార్థాలతో నిండిన కారు ఓ బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జవాన్ల శరీరాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఉగ్రవాదాలు మహీంద్రా స్కార్పియోను వాడినట్లు తెలుస్తోంది. అందులో 350 కిలోలకు పైగా పేలుడు పదార్థాలున్నాయి.


పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తోన్న జైషే మహ్మద్ సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌ పై దాడి చేసి 39 మందిని బలి తీసుకున్న కిరాతక చర్య సంగతి తెలిసిందే. జైషే మహ్మద్‌ పై ఐక్య రాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలు నిషేధం విధించాయన్న భారత్, మసూద్ అజహర్ నేతృత్వంలో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని స్పష్టం చేసింది. 

terrorist attack on pulwama  కోసం చిత్ర ఫలితం

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌ఫిఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనంపై ఉగ్రవాదులు బాంబులతో తెగబడ్డారు. ఈ దాడి నుండి జవాన్లను కోలుకోనివ్వకుండా పేలుడు  జరిగిన వెంటనే కాల్పులకు కూడా తెగబడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడి తో పేలుడు పదార్థాలతో నిండిన కారును కాన్వాయ్ లోకి పంపి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.


ఈ ప్రమాదంలో 20మంది జవాన్లు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. అలాగే దాదాపు 45మంది సైనికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆర్మీ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది. 


"ఉగ్ర కార్యకలాపాల నిర్వహణకు మసూద్ అజహర్‌ కు పాక్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాకిస్థాన్ కనుసన్న ల్లోనే తమపై దాడులు జరుగుతున్నాయి" అని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. దేశ భద్రతకు తగిన చర్యలు తీసుకు నేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తామన్న భారత్, ఉగ్రవాదానికి సహకారం నిలిపేయాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది. పాక్‌లో ఆశ్రయం పొందుతూ ఇతర దేశాలపై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదుల శిక్షణ శిబిరాల ను నేలమట్టం చేయాలని డిమాండ్ చేసింది. 

masood azhar jaish e mahammad కోసం చిత్ర ఫలితం
మహ్మద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి, పాక్ ఉగ్రవాద సంస్థలపై భద్రతామండలి నిషేధించడానికి వీలుగా అంతర్జాతీయ సమాజం సహకరించాలని భారత్ కోరింది. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. భారత సైన్యంపై ఉగ్రదాడులపట్ల నేపాల్ స్పందించింది. నరేంద్ర మోదీతో మాట్లాడిన నేపాల్ ప్రధాని దాడులను ఖండించారు. సైనికుల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: