రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చాలా వేగంగా మరే పరిణామాలు ఫలితాలను తారు మారు చేస్తాయి. 2014 ఎన్నికల్లో వైసీపీకి అధికారం ఖాయం అనుకున్న వారికి చివరి పదిహేను రోజులు తేడా కొట్టేశాయి. మొత్తం సీన్ రివర్స్ అయింది. మరిపుడు ఏం జరుగుతోంది...


నమ్మం బాబూ :


ఏపీలో అధికరా పార్టీ నుంచి ప్రతిపక్ష వైసీపీలోకి సాగుతున్న వలసలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమన్న అభిప్రాయన్ని ఈ వలసలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు. బాబు మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, చివరాఖర్లో ఎన్ని స్కీములు ప్రవేశపెట్టినా జనం నమ్మరని అంటున్నారు ఈ కారణంగానే ఆ పార్టీ నుంచి వైసీపీ వైపుగా దూసుకువస్తున్నారు. దానికి తోడు పలు జాతీయ సర్వేలు సైతం వైసీపీదే అధికారం అని చెప్పడం కూడా వలసలకు కారణమవుతోంది. పైకి చెబుతున్నట్లుగా పార్టీ మారుతున్న వారంతా సీట్ల గొడవతో కాదు, టీడీపీకి గెలిచే అవకాశాలు తక్కువ అనే ఈ వైపుగా వస్తున్నారని అంటున్నారు.


వైసీపీకి అనుకూల  సంకేతాలు :


ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో చేరికల వల్ల ఆ పార్టీ కచ్చితంగా గెలుస్తుందన్న సంకేతాలు ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు జనంలోనూ వెళ్తున్నాయి అంటున్నారు. వైసీపీకి సంబంధించి  పాదయాత్ర చేసిన తరువాత పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఆ మీదట జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు చాలా పరిణితితో ఉంటున్నాయని అంటున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయ చేరికలు మరిన్ని ఉంటాయని, అవన్నీ కూడా వైసీపీ వైపుగానే సాగుతాయని అంటున్నారు. తాజా పరిణామాలతో వైసీపీ శిబిరంలో కొత్త జోష్ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: