ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అధికార పార్టీ నుంచి వలసలు వైసీపీ లోకి రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఒక ఎంపీ వైస్సార్సీపీ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతటి తో ఈ వలసలు ఆగేటట్లు కనిపించే టట్లు లేదు.  ఉత్తరాంధ్రకు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు వారితో మాట్లాడించే ఏర్పాటు చేయాలని ఆ జిల్లాలకు చెందిన మంత్రులకు చెప్పినా సదరు ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.


టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!

ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు చర్యలతో పెరిగిన వ్యతిరేకత అంతా రేపటి ఎన్నికల్లో ప్రతిబింబించబోతోందని.. ప్రతిదానికీ బాబు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ క్రమంలో.. తెలుగుదేశం పార్టీ నుంచి అనేకమంది నేతలు పక్కచూపులు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ అవకాశం లేనిపక్షంలో మరి కొందరు జనసేనలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రానున్న పక్షంరోజుల్లో ఈ వలసల వ్యవహారం సలసల మరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Image result for chandra babu and jagan

కనీసం ముప్పైమంది నేతలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జిలుగా ఉన్నవారు.. ఉన్నారని సమాచారం. ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. విశేషం ఏమిటంటే.. వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీని వీడే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: