వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంఎల్సీ పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఏ ఇద్దరు ఎంఎల్ఏలకే కాదు నేతల మధ్య కూడా సరైన సఖ్యత లేదు. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసం నేతల మధ్య విపరీతమైన పోటీ ఉంది. దాంతో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్ళు అసంతృప్తితో ఏం చేస్తారో అన్న ఆందోళన చంద్రబాబునాయుడులో పెరిగిపోతోంది. మరీ రెండు మూడు రోజులుగా అయితే చంద్రబాబే దగ్గరుండి మరీ పంచాయితీలు చేస్తున్నా తెగటం లేదు.

 

 సోమిరెడ్డి రాజీనామా కూడా రామసుబ్బారెడ్డి పద్దతిలోనే జరిగిందని సమాచారం. జిల్లా రాజకీయాలను సర్దుబాటు చేయటంలో భాగంగానే చంద్రబాబు ఆదేశాల మేరకే సోమిరెడ్డి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు టికెట్ పై బాగా పడుతున్నారు. చాలా కాలంగా నెల్లూరు టికెట్ అజీజ్ కే అంటూ చంద్రబాబు చెబుతు వచ్చారు. కానీ టికెట్ ను హఠాత్తుగా మంత్రి నారాయణకు కేటాయించారు. దాంతో అప్పటి నుండి అజీజ్ బాగా గుర్రుగా ఉన్నారు.

 

ఇంకా ఇటువంటం పంచాయితీలు చాలా ఉన్నాయి. నెల్లూరులో టిడిపి అభ్యర్ధి గెలవాలంటే అజీజ్ సహకారం చాలా అవసరం. ఎందుకేంటే నెల్లూరు నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు సుమారు 25 వేల దాకా ఉన్నాయట. అందుకనే అజీజ్ ను సంతృప్తి పరిచేందుకు ఎంఎల్సీ పదవిని చంద్రబాబు ఎరగా వేసినట్లు సమాచారం. అంటే సోమిరెడ్డి రాజీనామా చేసిన సీటును అజీజ్ కు కేటాయిస్తారన్నమాట.

 

సోమిరెడ్డి రాజీనామా చేసిన ఎంఎల్సీ పదవీ కాలం 6 ఏళ్ళు. ఇప్పటికి మూడేళ్ళయ్యుంటుంది. అంటే దాదాపు మూడేళ్ళ పదవీ కాలం మిగిలే ఉంది. ఆ పదవిని ఇపుడు అజీజ్ కు ఇవ్వటానికి చంద్రబాబు నిర్ణయించే సోమిరెడ్డితో రాజీనామా చేయించారట. రాబోయే ఎన్నికల్లో సోమిరెడ్డి సర్వేపల్లి నుండి పోటీ చేయబోతున్నారు. వరుసగా ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో అయినా గెలుస్తారో లేదో చూడాల్సిందే ?


మరింత సమాచారం తెలుసుకోండి: