ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ హవా కనిపిస్తోంది. అధికార పార్టీ క్రమంగా డిఫెన్సులో పడిపోతోంది. అధికార పార్టీ నుంచి జోరుగా ప్రతిపక్షంలోకి వలసలు వస్తున్నాయి. వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్న ధీమా కారణంగానే ఇలా నేతలు జగన్ ముందు క్యూ కడుతున్నారన్న వాదన ఉంది.



ఇలాంటి సమయంలో జగన్ కు మరో రాజకీయ మప్పు పొంచి ఉంది. అదే.. కే ఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ తరపున బరిలో దిగుతున్న కేఏ పాల్ ను మొదట్లో అందరూ చాలా తక్కువ అంచనా వేసారు. ఆయనో కామెడీ స్టఫ్ అని అంతా అనుకున్నారు. కానీ సీన్ మారుతోంది.



కే ఏ పాల్ కూడా పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పాల్ ఎన్ని సీట్లుగెలుచుకుంటాడన్నది ఇక్కడ విషయం కాదు. ఆయన ఎవరి ఓట్లు చీలుస్తాడన్నది మ్యాటర్. సహజంగా కే ఏ పాల్ ఓట్లు క్రిస్టియన్ ఓట్లేనన్నది బహిరంగ రహస్యమే.



ఈ క్రిస్టియన్ ఓట్లలో మెజారిటీ భాగం ఎస్సీలవే ఉంటాయన్న సంగతీ వాస్తవమే. కే ఏ పాల్ కు మతప్రభోదకుడిగా మంచి పేరు ఉంది. సో.. ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని కేఏ పాల్ పావులు కదిపితే జగన్‌కు వచ్చే ఎస్సీల ఓట్లు పాల్ పాలపడటం ఖాయం. మరి గణనీయ సంఖ్యలో ఉన్న ఈ ఓట్లను పాల్ చీలిస్తే జగన్‌కు భారీ నష్టం తప్పదు. గతంలో వెంట్రుకవాసిలో అధికారం కోల్పోయిన జగన్.. ఇప్పుడు పాల్ కారణంగా ఇబ్బందిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: